గ్రాండ్ వెల్ కం : ట్రంప్ – మోడీ..22 కిలోమీటర్ల రోడ్ షో

కళాకారుల నృత్యాలు, రంగు రంగుల వస్త్రధారణలు, సంప్రదాయ బద్ధంగా మహిళల డ్యాన్స్‌లు, డప్పులు, వాయిద్యాలు..ప్రజల కేరింతలు..వెల్ కం అంటూ ప్లకార్డులు, మోడీ..ట్రంప్‌తో కూడిన సైన్ బోర్డులు, అద్దంలా ఉన్న రోడ్లు, రోడ్డుకిరువైపులా పూలకుండీలు..ఇలా…అమెరికన్ ప్రెసిడెంట్…ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది.
ట్రంప్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అహ్మాదాబాద్ నుంచి మోతేరా స్టేడియం వరకు…అంటే దాదాపు 22 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా..ప్రజలు చేతులు..ఊపుతూ..ఇండియన్ ఫ్లాగ్స్ జెండాలు పట్టుకుని అమెరికన్ ప్రెసిడెంట్‌కు స్వాగతం పలికారు.
See Also>>ట్రంప్‌కు ముందే మోడీ: వెల్‌కమ్ స్పీచ్‌లో ఇలా
ఈ రోడ్ షో..అందరికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు. అహ్మాదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆయన ప్రయాణించే మార్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. కనీసం ఏ ఛాన్స్ కూడా వదలలేదు. రోడ్డుకిరువైపులా పూల చెట్లు..అద్దం తలపించేలా రోడ్లను తీర్చిదిద్దారు. సంప్రదాయానికి అనుగుణంగా కళాకారులు నృత్యాలు చేశారు.
మూడు గంటలపాటు జరిగే ఈ పర్యటన కోసం కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసింది. దీనికోసం గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోంది. రోడ్ షో పొడవునా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ సంప్రదాయ దుస్తులతో కనిపించారు.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ లో పాన్ షాపులను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ఎవ్వరూ పాన్ నమిలి ఊయకుండా, గోడలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ – మోడీ రోడ్ షో మార్గంలో ట్రంప్ కు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గడను కూడా నిర్మించారు.
* అమెరికా పెద్దన్న ట్రంప్..భారతదేశంలో అడుగు పెట్టారు.
* 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఉదయం ట్రంప్..సతీసమేతంగా..అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
* ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతరులు వారికి ఘన స్వాగతం పలికారు.
* అనంతరం మార్గ మధ్యంలో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని వారు సందర్శించారు.
* గాంధీ చిత్రపటానికి నూలు దండ వేసి నివాళులర్పించారు ట్రంప్. మోడీ.
* గాంధీజీ వాడిన చరఖాను ట్రంప్ దంపతులు తిప్పారు.
* సబర్మతి ఆశ్రమ విశిష్టతను ట్రంప్ దంపతులకు మోడీ వివరించారు.