మరో రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ

  • Published By: madhu ,Published On : August 14, 2020 / 06:32 AM IST
మరో రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ

Updated On : August 14, 2020 / 7:05 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు సృష్టించారు. అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా మోడీ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని ప్రసాదర భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఎక్కువ కాలం పని చేసిన వారిలో మోడీదీ నాలుగో ప్లేస్. గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి ఉన్న సంగతి తెలిసిందే. వాజ్ పేయి 2268 రోజులు పదవిలో కొనసాగారు.

నరేంద్ర మోడీ 2014, మే 26వ తేదీన 14వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి ప్రధానిగా 2019, మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే..సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు.

తొలి ప్రధాని నెహ్రూ 16 ఏళ్ల 286 రోజులు పదవిలో కొనసాగగా, ఆయన కుమర్తె ఇందిరా గాంధీ 11 ఏళ్ల 59 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. మోడీ ప్రధానిగా ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు.

ప్రధాని కాకముందు…2001 నుంచి 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర గుజరాత్ లోని వడ్నాగర్ జన్మించిన మోడీ…యుక్త వయస్సులో టీ అమ్మారు. ఛాయ్ అమ్ముకొనే స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగారు. పాఠశాలలో మంచి వక్తగా గుర్తింపు పొందారు.

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ లో చేరారు. 18 ఏళ్ల వయస్సులో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమం..ఇంటి నుంచి…పారిపోయారు. 1971లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అనేక మందిని జైలులో పెట్టారు. ఈ సమయంలో మోడీ అజ్ఞాతంలోకి ఉండి ఓ పుస్తకం రాశారు.

1985లో బీజేపీలోకి మారారు. కేశుభాయ పటేల్ ను గుజరాత్ సీఎంగా నియమించే వరకు మోడీ పలు పదవులను నిర్వహించారు. 2002లో గుజరాత్ లో జరిగిని అల్లర్లను మోడీ నియంత్రించలేదనే అపవాదు ఉండేది. 2012లో దీనిన పర్యవేక్షించిన సుప్రీం..మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

2013లో అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ఎదుర్కొంది. ఆర్థిక మందగమనం, ప్రజల వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకుంది. అనంతరం మోడీ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. స్వచ్చ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇతర ప్రచారాలు ప్రజలను ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టం, జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర విభజన, రిజర్వేషన్ల సవరణ బిల్లులను, ఆర్టికల్ 370 సవరణ తీర్మానం కీలక అంశాలు.