Birthday Wishes : మొదటి సారి దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

బౌద్ధమత గురువు దలైలామా 86వ జన్మదినం కావడంతో ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సుదీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. దలైలామా పుట్టున రోజు నాటు ప్రధాని మోదీ ఫోన్ చేసి పలకరించడం ఇదే తొలిసారి.

Birthday Wishes : మొదటి సారి దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Birthday Wishes

Updated On : July 6, 2021 / 9:21 PM IST

Birthday Wishes :  బౌద్ధమత గురువు దలైలామా 86వ జన్మదినం కావడంతో ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సుదీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. దలైలామా పుట్టున రోజు నాడు ప్రధాని మోదీ ఫోన్ చేసి పలకరించడం ఇదే తొలిసారి.

ఇక కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యాంగా ఉండాలని కోరుకున్నారు. ఇదిలా ఉంటే చైనా ఒత్తిడితో 1959లో దలైలామా శరణార్థిగా భారత్ కు వచ్చారు.

అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉంటున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. టిబెట్ ప్రాంతానికి చెందిన దలైలామా, చైనా టిబెట్ ను ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చైనా తమ దేశం విడిచి వెళ్లాలంటూ అనేక అంతర్జాతీయ వేదికల మీద తన గళం వినిపించారు.