Malaria: జ్వరం వస్తే మంత్రగాడి వద్దకు వెళ్లిన బాలుడు.. ఒకేసారి మలేరియా, లెప్టోస్పిరోసిస్, డెంగీ సోకి చివరకు..
సాధారణంగా మలేరియా, లెప్టోస్పిరోసిస్, డెంగీ ఒకేసారి సోకడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా.

Dengue
Malaria – dengue: ముంబై(Mumbai)లో 14 ఏళ్ల ఓ బాలుడికి మలేరియా(Malaria), లెప్టోస్పిరోసిస్ (leptospirosis), డెంగీ ఒకేసారి సోకింది. కుర్లా ప్రాంతానికి చెంది ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రాణాలు నిలవలేదు. మూడు వ్యాధులూ ఒకేసారి సోకడంతో అతడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడు ఆసుపత్రిలో ఆలస్యంగా చేరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ఈ నెల మొదటి వారంలో ఆ బాలుడు జ్వరంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ఆ బాలుడు ఆసుపత్రికి వెళ్లలేదు. స్థానికంగా ఉండే మంత్రగాడి వద్దకు వరుసగా ఏడు రోజులు వెళ్లి మంత్రం వేయించుకుని, తనకు వచ్చిన జ్వరం తగ్గిపోతుందనుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఆగస్టు 14న కస్తూర్భా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లాడు.
దీంతో అతడికి టెస్టులు చేయించిన వైద్యుడు డెంగా, మలేరియా పాజిటివ్ గా నిర్ధారించారు. అనంతరం అతడికి లెప్టోస్పిరోసిస్ కూడా సోకిందని టెస్టుల్లో తేలింది. అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ముంబై సెంట్రల్ లోని నైర్ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడికి ఊపిరితిత్తుల సమస్యలు రావడంతో అతడిని వెంటిలేటర్ పై ఉంచారు.
అతడు శ్వాసకోస సమస్యలతోనూ ఇబ్బందులు పడ్డాడు. కిడ్నిల పనితీరుని తెలిపే క్రియాటినిన్ స్థాయులు అత్యధికంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ బాలుడి సోకిన ఇన్ఫెక్షన్లు, వ్యాధుల లక్షణాలు, శరీర అవయవాల వైఫల్యాలను తగ్గించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేదు.
పెద్దాసుపత్రిలో చేరిన మూడు రోజుల్లో అతడు మృతి చెందాడు. సాధారణంగా మలేరియా, లెప్టోస్పిరోసిస్, డెంగీ ఒకేసారి సోకడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా కనపడతాయని అన్నారు. ఆ బాలుడు జ్వరం వచ్చిన వెంటనే మంత్రగాడి వద్దకు వెళ్లకుండా నేరుగా వైద్యుడి వద్దకు వెళ్తే బతికేవాడని, అతడి ఆరోగ్యం ఇంతగా క్షీణించకపోయేదని అన్నారు. ముంబైలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నెలలో 959 మలేరియా, 265 లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదయ్యాయి.
Drinking Too Much Tea : మోతాదుకు మించి టీ తాగటం వల్ల కలిగే ఆరోగ్యపరమైన అనర్ధాలు