Mumbai Covid : ముంబైలో కొత్తగా 13,648 కేసులు, 5 మరణాలు..

ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజు కూడా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల్లో కన్నా సోమవారం కొత్తగా 13,648 కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.

Mumbai Covid : ముంబైలో కొత్తగా 13,648 కేసులు, 5 మరణాలు..

Mumbai Records 13,648 New Covid Cases, 5 Deaths In 24 Hours (1)

Updated On : January 10, 2022 / 9:23 PM IST

Mumbai Covid Cases : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజు కూడా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల్లో నిన్నటి (ఆదివారం) కన్నా సోమవారం కొత్తగా 13,648 కరోనా కేసులు తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం ముంబైలో కరోనా కేసుల సంఖ్య 9,28,220కు చేరగా.. కరోనా మరణాల సంఖ్య 16,411గా నమోదైంది. ముంబై నగరంలో ఈరోజు కొత్తగా 5 మరణాలు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజునే మొత్తంగా 59,242 కరోనా టెస్టులను నిర్వహించారు. నగరంలో ఒక్కరోజే 23శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.

ముంబైలో శనివారం 20,318 కేసుల కన్నా ఆదివారం 19,474 కేసులు తక్కువగా నమోదయ్యాయి. ముంబై మురికివాడైన ధారవిలో కొత్తగా 97 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 943గా నమోదైంది. రాష్ట్రప్రభుత్వం ఆదివారమే కొవిడ్ సంబంధిత ఆంక్షలను సవరించింది.

జనవరి 11 నుంచి జిమ్స్, బ్యూటీ సెలూన్లు 50శాతంతో మాత్రమే నిర్వహించుకునేలా అనుమతించింది. కరోనా తీవ్రత దృష్ట్యా స్కూళ్లు, కాలేజీలను ఫిబ్రవరి 15వరకు మూసివేయనున్నట్టు తెలిపారు. పెళ్లిళ్లు, పార్టీ సమావేశాలు, ప్రాంతీయ సమావేశాలు, పండుగ ఉత్సవాలు, రాజకీయ సమావేశాలపై కూడా ముంబై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Read Also : Covid Protocols: కొవిడ్ రూల్స్ ధిక్కరించిన వారికి ఒక్క రోజులో రూ.74లక్షల ఫైన్