Karnataka: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో 4 రోజుల పోలీస్ కస్టడీకి మురుగ మఠాధిపతి శివమూర్తి

మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరనరుని నాలుగు రోజుల (సెప్టెంబర్ 5) పోలీస్ కస్టడీకి పంపారు. వాస్తవానికి 5 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనికి ముందు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తరలించారు.

Karnataka: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో 4 రోజుల పోలీస్ కస్టడీకి మురుగ మఠాధిపతి శివమూర్తి

Murugha Mutt seer sent to 4day police custody for raping 2 minor girls

Updated On : September 2, 2022 / 7:49 PM IST

Karnataka: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో అరెస్టైన లింగాయత్ కమ్యూనిటీ గురువు, మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరనరుని నాలుగు రోజుల (సెప్టెంబర్ 5) పోలీస్ కస్టడీకి పంపారు. వాస్తవానికి 5 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనికి ముందు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో శుక్రవారం జిల్లా సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు.

ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటకలోని శ్రీ మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అనంతరం జిల్లా సెషన్స్​ జడ్జి ముందు ప్రవేశపెట్టి హాజరుపర్చారు. శివమూర్తి మురుగ శరణరుకు జడ్డి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నిందితుడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆగస్టు 26న శివమూర్తి మురుగ శరణరుపై పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు.

అయితే, ఆ సమయంలో ఆయన పలు ఆరోపణలు చేశారు. కర్ణాటక మురుగమఠ్ నిర్వాహకుడు ఎస్కే బసవరాజన్, ఆయన భార్య కలిసి తనపై కుట్ర పన్ని కేసు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఎస్కే బసవరాజన్ తో పాటు ఆయన భార్య సౌభాగ్యపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతేకాదు, అదే సమయంలో బసవరాజన్ పై మురుగమఠం వార్డెన్ రష్మీ అత్యాచారం, అపహరణ కేసులు పెట్టడం గమనార్హం. అసలు బసవరాజన్ ఎస్కేకు, శివమూర్తి శరణుకు ఎలా పరిచయం ఏర్పడిందంటే… వారిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.

Power Cut In Nitish Kumar Meeting: సీఎం, డీప్యూటీ సీఎం పాల్గొన్న మీటింగ్‭లో పవర్ కట్

వారు లింగాయత్ లోని జన్గమారు కమ్యూనిటికీ చెందినవారు. ఒకే సమయంలో మఠంలో చేరారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బసవరాజన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సౌభాగ్యతతో ఆయన ప్రేమలోపడ్డారు. దీంతో మఠాధిపతి బాధ్యతలను స్వీకరించలేకపోయారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం శివమూర్తి శరణుకు వచ్చింది. సౌభాగ్యను బసవరాజ్ పెళ్ళి చేసుకున్న తర్వాత మఠ నిర్వాహకుడిగా నియమితుడయ్యారు.

ఓ కమిటీని ఏర్పాటు చేసి మఠానికి సంబంధించిన లావాదేవీలు తన సంతకం చేస్తేనే జరిగేలా చేసుకున్నారు. అనంతరం బసవరాజ్ మఠానికి చెందిన డబ్బును దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మఠానికి చెందిన ఆస్తులను అమ్మేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను 2007లో మఠ నిర్వాహకుడి బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం ఆయన 2008లో జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

Narmada Canal: ముగ్గురు పిల్లల్ని కెనాల్‭లో విసిరేసి.. ప్రియుడితో కలిసి అదే కెనాల్‭లో దూకిన మహిళ