ఏది నిజం ఏది అబద్ధం : పాక్ అదుపులో భారత పైలెట్?

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 09:32 AM IST
ఏది నిజం ఏది అబద్ధం : పాక్ అదుపులో భారత పైలెట్?

Updated On : February 27, 2019 / 9:32 AM IST

భార‌త పైల‌ట్ ను అరెస్ట్ చేసిన‌ట్లు పాక్ చెబుతున్న‌దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి భారత వాయుసేన డ్రెస్ వేసుకొని ఉన్నాడు. కళ్లకు గంతలు కట్టి,చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. తన పేరు వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ అని చెబుతున్నాడు. నెంబర్ 27981 అని అతను చెబుతున్నట్లు ఆ వీడియోలో కన్పిస్తోంది.
Also Read: Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

అయితే పాక్ అన్నీ అవాస్తవాలే చెబుతోందని,భారత యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్ ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది.భారత వాయుసేనకు చెందిన పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్ వోసీ దాటిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని ప్రకటించారు. 

ఒకదాన్నిపీఓకేలో, మరొకటి కాశ్మీర్ లో కూల్చివేసి, ఒక భారత పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గపూర్ ట్వీట్ చేశాడు. పైలట్ కు బాగా గాయాలయ్యాయని,అతడిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించినట్లు గఫూర్ తెలిపాడు.
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్