Neelamma: నీలమ్మ స్ఫూర్తి పాఠం.. స్మశానంలోనే జీవనం.. 70ఏళ్ల వయసులోనూ సమాధులు తవ్వుతూ ఉపాధి.. ఎందుకంటే?
ఓ మహిళ స్మశానంలోనే నివాసం ఉంటుంది. రాత్రిపగలు అనేతేడా లేకుండా ఆమె అక్కడే జీవనం సాగిస్తుంది.

Neelamma
Neelamma: శ్మశానం దగ్గరకు వెళ్లాలంటే ఎవరైనా కాస్త వెనకడుగు వేస్తారు. రాత్రివేళల్లో అక్కడే జీవనం సాగించాలంటే ఎవరూ అలాంటి సాహసం చేయరు. అందులోనూ మహిళలయితే అటువైపు కూడా వెళ్లరు. కానీ, ఓ మహిళ స్మశానంలోనే నివాసం ఉంటుంది. రాత్రిపగలు అనేతేడా లేకుండా ఆమె అక్కడే జీవనం సాగిస్తుంది. శ్మాసనంలో సమాధువులు తవ్వడమే వృత్తిగా ఎంచుకుంది. ఏకంగా 30ఏళ్లుగా అక్కడే ఉంటూ వేల సమాధులు తవ్వి ఉపాధి పొందుతోంది.
Also Read: Bird Flu: బాబోయ్.. 8వేల కోళ్లు మృతి.. బర్డ్ ఫ్లూనే కారణమా.. భయాందోళనలో ఆ రెండు జిల్లాల ప్రజలు
కర్ణాటకలోని మైసూర్ నగరం సంతే సరగూర్ ప్రాంతానికి చెందిన నీలమ్మకు 1975లో వివాహమైంది. ఆమె భర్త శ్మశానవాటికలో సమాధులు తవ్వేవాడు. తన భర్త పనిలో సహాయకారిగా ఉండేది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2005లో అనారోగ్యంతో భర్త మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యతలను భుజానెత్తుకున్న నీలమ్మ.. మైసూర్ విద్యారణ్యపురంలోని వీరశైవ రుద్రభూమిలో సమాధులు తవ్వే పనిలో చేరింది. ప్రస్తుతం ఆమె వయస్సు 70ఏళ్లు. ఇప్పటికీ ఆమె సమాధువులు తవ్వుతూ ఉపాధి పొందుతుంది. ఎవరికీ భారం కాకుండా బతికేందుకే శవాలు పూడ్చేందుకు గోతులు తవ్వడాన్ని జీవనోపాధిగా చేసుకున్నట్లు ఆమె చెప్పింది. ఇప్పటి వరకు 5వేలకు పైగా శవాల కోసం గోతులు తవ్వినట్లు చెప్పింది.
Also Read: The Paradise glimpse : అదిరిపోయిన నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్.. ఇది కడుపు మండిన కాకుల కథ.
మొదట్లో ఒక్కో సమాధికి రూ.150 వచ్చేవట.. ప్రస్తుతం రూ. 1500 ఇస్తున్నారు. నీలమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు బెంగళూరులో స్థిరపడగా.. మరొకరు తల్లితోపాటు ఉంటున్నారు. కొడుకు, కోడలు, మనవళ్లతోపాటు శ్మశానంలోనే ఆమె నివాసం ఉంటుంది. బతికినంతకాలం ఎవరికీ భారం కాకుండా పనిచేస్తూ చనిపోవాలన్నదే ఆమె చివరి కోరిక. తాను, తన ఇద్దరు కుమారుల మరణానంతరం తమ మృతదేహాలను మైసూర్ మెడికల్ కాలేజీకి దానం చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. అంతేకాదు.. శ్మశానవాటిక దేవాలయం వంటిది.. నా భర్త మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేశాం. నిద్రలేవగానే ఆయన సమాధినే చూస్తానంటూ నీలమ్మ చెప్పింది.