Bird Flu: బాబోయ్.. 8వేల కోళ్లు మృతి.. బర్డ్ ఫ్లూనే కారణమా.. భయాందోళనలో ఆ రెండు జిల్లాల ప్రజలు
ఆ రెండు జిల్లాల్లో ప్రజలను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తోంది. ఏకంగా 8వేల కోళ్లు మృత్యవాత పడటంతో..

Bird Flu
Bird Flu: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలను కొద్దిరోజులుగా బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడంతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చికెన్ ముక్కలేనిదే ముద్దదిగని వారుసైతం నెల రోజులుగా చికెన్ కు దూరమయ్యారు. అయితే, గత వారం రోజులుగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టడంతో చికెన్ దుకాణాల వద్ద మాంసాహారుల క్యూ పెరుగుతోంది. ఫలితంగా ఇన్నాళ్లు తగ్గిన చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, తాజాగా.. 8వేల కోళ్లు మృత్యువాత పడటం కలకలం సృష్టిస్తోంది.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. మొదటి విడత రూ.1,00,000 ఇచ్చేది ఎప్పుడో చెప్పిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. ఈ రెండు జిల్లాల్లో ఏకంగా ఎనిమిది వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని ఓ పౌల్ట్రీఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ లోని ఓ కోళ్ల ఫారంలో మూడు రోజుల్లో వెయ్యికి పైగా కోళ్లు వింత వ్యాధితో చనిపోయాయి. దీంతో బర్డ్ ఫ్లూ వల్లే ఈ కోళ్లు చనిపోయాయన్న చర్చ జోరుగాసాగుతుంది. దీంతో స్థానిక ప్రజలు వణికిపోతున్నారు.
Also Read: రేషన్ కార్డులు వచ్చేదెప్పుడో..! తికమక ప్రకటనలతో జనం పరేషాన్.. అసలు విషయం చెప్పిన అధికారి
కోళ్లు మృత్యువాత పడిన ఫారంను జిల్లా పశువైద్య అధికారులు సందర్శించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి.. కొన్నింటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అయితే, కోళ్ల మృతికి స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. అంతేకాక.. మెదక్ జిల్లాలో మరో రెండు పౌల్ట్రీఫాంలలో వందల కోళ్లు మరణించడం గమనార్హం. మొత్తానికి బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోయిందని చికెన్ షాపుల వద్దకు క్యూకట్టిన మాంసాహారాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వేల కోళ్లు మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేస్తోంది.