National Herald Case : సోనియా, రాహుల్ లకు ఈడీ భారీ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014లో కోర్టు ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఇండియన్ సంస్థలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా రూ.752 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.

National Herald Case : సోనియా, రాహుల్ లకు ఈడీ భారీ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్

Sonia Gandhi - Rahul Gandhi

National Herald Case : కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీల కుబుంబానికి చెందిన రూ.752 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో గతంలో సోనియా, రాహుల్ కు సమన్లు జారీ చేసి విచారణ రావాలని తెలిపింది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఈడీ తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో వారి ఆస్తులను జప్తు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014లో కోర్టు ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఇండియన్ సంస్థలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా రూ.752 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. యంగ్ ఇండియా సంస్థతో సహా ఏడుగురు నిందితులు ఈ కేసు నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, నిజాయితీ లేకుండా ఆస్తుల దుర్వినియోగం, కుట్ర వంటి నేరాలకు పాల్పడ్డారని ఢిల్లీ కోర్టు గతంలో తేల్చింది.

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

యంగ్ ఇండియన్ ద్వారా అసోసియేడెట్ జర్నల్స్ లిమిటెడ్ – ఏజేఎల్ కు చెందిన వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగిందని విచారణలో తేలింది. న్యూస్ పేపర్లను ప్రింట్ చేసేందుకు తక్కువ ధరకు భూమిని పొందిన ఏజేఎల్ సంస్థ 2008లో తన కార్యకాలాపాలను నిలిపివేసింది. అనంతరం వాణిజ్య ప్రయోజనాల కోసం ఆ ఆస్తులను వాడుకుందని ఈడీ విచారణలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీకి ఏజేఎల్ సంస్థ రూ.90 కోట్ల అప్పు చెల్లించాల్సి వచ్చింది.

అయితే ఏజేఎల్ సంస్థ ఆ అప్పు చెల్లించలేని పరిస్థితిలో ఉందని కాంగ్రెస్ చూపించింది. అంతేకాకుండా ఏజేఎల్ సంస్థను కాంగ్రెస్ మరో కొత్త సంస్థ యంగ్ ఇండియాలో విలీనం చేసింది. అందుకుగానూ రూ.50 లక్షలు కూడా చెల్లించింది. ఈక్రమంలో ఏజేఎల్ వాటాదారులను కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు మోసం చేశారని కోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఏజేఎల్ ను యంగ్ ఇండియాకు ఇచ్చిన తర్వాత పాత రుణం చెల్లించాలని లేదా ఏజేఎల్ షేర్స్ కేటాయించాలని కోరింది.

Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికుల గోస

దీంతో ఏజేఎల్ సంస్థ అత్యవసరంగా సమావేశమై మూలధనం పెంపుతో పాటు యంగ్ ఇండియాకు తాజాగా రూ.90.21 కోట్ల విలువైన షేర్ల జారీకి తీర్మానం చేసింది. ఈ తాజా షేర్ల కేటాయింపుతో 1000 కన్నా ఎక్కువ మంది వాటాదారుల వాటా కేవలం ఒక శాతానికి తగ్గించారు. అదే సమయంలో ఏజేఎల్ సంస్థ కూడా యంగ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది. అప్పుడే యగ్ ఇండియా ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ కూడా తెచ్చుకుందని, అందులో అక్రమాలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది.