మోస్ట్ పాపులర్ సీఎం : నవీన్ పట్నాయక్ నెం.1, కేసీఆర్‌కు 5వ స్థానం

మోస్ట్ పాపులర్ సీఎం : నవీన్ పట్నాయక్ నెం.1, కేసీఆర్‌కు 5వ స్థానం

Updated On : January 24, 2021 / 7:46 PM IST

Naveen Patnaik most popular CM in his own state: MOTN poll దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి నెం.1స్థానంలో నిలవగా..ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 2వ స్థానంలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 3వస్థానంలో నిలిచారు. ఇక,తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో 5వస్థానంలో నిలిచారు.

మూడ్‌ ఆప్‌ ది నేషన్‌ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 2021 జనవరి 3 నుంచి 13 వరకు ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్‌సైట్స్‌తో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN) పోల్‌ చేపట్టింది. ఈ సర్వేలో మొత్తం 12,232 మంది పాల్గొన్నట్లు ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ వెల్లడించింది.

పోల్‌ ప్రకారం… ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర స్థాయిలో 51 శాతంతో ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా నిలిచారు. జాతీయస్థాయి రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ పట్నాయక్.. కొంతకాలంగా రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టి ఒడిశాను అభివృద్ధిపథం వైపు నడిపించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 41 శాతం మంది ఓటు వేయగా.. 39 శాతం మంది యోగి ఆదిత్యనాథ్‌కు మద్దతు తెలిపారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరికీ 35 శాతం మంది ఓట్లు లభించాయి.