Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.. అజిత్ పవార్ తిరుగుబాటు

డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ను బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వం వర్గం నియమించింది.

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.. అజిత్ పవార్ తిరుగుబాటు

Ajit Pawar

Updated On : July 2, 2023 / 3:15 PM IST

Maharashtra – Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar)పై ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్‌ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు.

అజిత్‌ పవార్‌ ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించింది. కొన్ని రోజుల క్రితమే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగిన విషయం తెలిలిసిందే. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ ను నియమించారు. ఆ పార్టీలో అజిత్ పవార్ ‭కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

అజిత్ పవార్‭ వ్యవహరిస్తోన్న తీరు వల్లే ఆయనను శరద్ పవార్ పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది. చివరకు అజిత్ పవార్.. బీజేపీ-శివసేన షిండే వర్గంతో చేతులు కలిపి వారిలో కలిసిపోయారు. అజిత్ తో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్ లో చేరే అవకాశం ఉంది.

అజిత్ పవార్ రాజ్ భవన్ కు వెళ్లారు. అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన పవార్ షిండే కేబినెట్ లో చేరారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, మంత్రులుగా ఛగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే, ధనుంజయ ముండే ప్రమాణం చేశారు. శరద్ పవార్ వర్గ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు.

Sukesh Chandrasekhar: త్వరలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లడం ఖాయం.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్