Madhya Pradesh : కరోనా వేళ..రాజీనామా చేసిన 3 వేల మంది జూనియర్ వైద్యులు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఇక్కడి రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె చేపడుతున్నారు.

Madhya Pradesh : కరోనా వేళ..రాజీనామా చేసిన 3 వేల మంది జూనియర్ వైద్యులు

Madhya Pradesh

Updated On : June 4, 2021 / 10:41 AM IST

Madhya Pradesh Doctors Resign : కరోనా మహమ్మారి సమస్య ఇంకా సమసిపోలేదు. గతంలో కంటే..పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. కరోనా రోగులను బతికించేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే..కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడడంతో జూ.వైద్యులు సమ్మె బాట పడుతున్నారు. అయితే..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఇక్కడి రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె చేపడుతున్నారు.

దీనిపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. 24 గంటల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల సమ్మె చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనిపై జూనియర్ డాక్టర్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న దాదాపు మూడు వేల మంది జూనియర్ వైద్యులు తమ పోస్టులకు రాజీనా చేశారు. ఆయా కాలేజీల డీన్ లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ మీనా వెల్లడించారు.

డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. కరోనా వైరస్ సోకితే…తమకు, తమ కుటుంబాలకు స్టయిఫండ్ పెంచాలని, ఉచిత చికిత్స అందించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. ఉచిత చికిత్స అందించాలన్నారు.

Read More : Fuel Prices : మళ్లీ పెరిగిన చమురు ధరలు