మరోసారి నీట్ పరీక్ష

  • Published By: venkaiahnaidu ,Published On : October 12, 2020 / 06:45 PM IST
మరోసారి నీట్ పరీక్ష

Updated On : October 12, 2020 / 6:57 PM IST

NEET to be held again మరోసారి నీట్ పరీక్ష జరగనుంది. గత నెలలో కరోనా లేదా కంటైన్మెంట్ జోన్లలో ఉండటం వల్ల ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ (National Eligibility cum Entrance Test)ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీం కోర్టు మరో అవకాశమిచ్చింది. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 14న నీట్ రాసేందుకు అనుమతిస్తున్నట్లు సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.



కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. అక్టోబర్ 16న నీట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. అక్టోబర్ 14న నిర్వహించనున్న నీట్ పరీక్షకు.. విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించిన తర్వాతే పరీక్ష గదిలోనికి పంపుతారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తొలుత అభ్యర్థుల చేతులకు శానిటైజ్‌ చేసి తరువాత థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారు.