దేశంలో 116కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

దేశంలో 116కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

Updated On : January 16, 2021 / 6:58 PM IST

New coronavirus strain భారత్​లో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో తాజాగా మరో ఇద్దరు కొత్త రకం కరోనా​ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొత్త రకం కరోనా బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, బాధితులందరినీ నిర్బంధంలో ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదేవిధంగా, ఇటీవల రోగులను కలిసిన వారినీ క్వారంటైన్​లో ఉంచడంతో పాటుగా సమగ్ర కాంటాక్ట్​ ట్రేసింగ్​ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వైరస్​ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు,భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1కోటీ 5లక్షల 43వేల 569కి చేరగా…కోలుకున్న వారి సంఖ్య 1కోటీ 1లక్షా79వేల715కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య కేవలం 2లక్షల 11వేల 33మాత్రమేనని కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 2శాతం మాత్రమే యాక్టీవ్ కేసులున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 96శాతం దాటిందని తెలిపింది.

ఇక,వేయికళ్లతో ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. మొదటగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.