Shimla temple collapses : సిమ్లాలో కూలిన శివాలయం…9మంది మృతి

Shimla temple collapses
Shimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడటంతో డజన్ల కొద్దీ చిక్కుకున్నారు. (temple collapses in rain-hit Shimla) హిమాచల్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సావన్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు.
Himachal cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో మళ్లీ ఉప్పొంగిన బియాస్ నది…ఏడుగురి మృతి
శివాలయం కూలిన సంఘటన జరిగినప్పుడు దాదాపు 50 మంది ఉన్నారని ఓ అధికారి చెప్పారు. (Shimla temple collapses) ఇప్పటికీ చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. శివ్ మందిర్ కూలిన ఘటనలో ఇప్పటికి 9 మృతదేహాలను వెలికితీశారు. ఆలయం కూలిన ప్రదేశానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి.
China : చైనా వరదల్లో 21 మంది మృతి, ఆరుగురు గల్లంతు
బియాస్ నది నీటిమట్టం పెరిగింది. వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కొంతమంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించారు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జాదోన్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆరుగురిని రక్షించినట్లు అధికారి తెలిపారు.
Floods In Himachal : హిమాచల్ వరదల్లో 257కు చేరిన మృతుల సంఖ్య
గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, బస్సులు ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా-చండీగఢ్ రహదారితో సహా పలు రహదారులను మూసివేశారు. సోలన్‌లోని కోటి సమీపంలోని చక్కి మోర్ వద్ద రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు నిలిచిపోయాయి.