Manipur Violence: మళ్లీ రణరంగమవుతోన్న మణిపూర్‭.. గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు, 9 మంది మృతి

మణిపూర్ రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.

Manipur Violence: మళ్లీ రణరంగమవుతోన్న మణిపూర్‭.. గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు, 9 మంది మృతి

Kuki Militants Attack: మణిపూర్ రాష్ట్రం మరోసారి ఉలిక్కి పడింది. మంగళవారం రాత్రి కొందరు తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో తొమ్మిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మైతీలు అధికంగా ఉన్న ఈస్ట్ ఇంపాల్, గిరిజనులు అధికంగా ఉన్న కంగపోక్పి జిల్లాల సరిహద్దులో ఉన్న ఖమెన్లోక్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Minister Harish Rao : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణకు అడుగులు : మంత్రి హరీశ్ రావు

రిపోర్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఖమెన్లోక్‭లోని పలు ఇళ్లను సైతం దుండగులు కూల్చివేశారు. అర్థరాత్రి ఆయుధాలతో వచ్చిన తీవ్రవాదులు.. గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో ఇంపాల్‭లో మళ్లీ కఠిన కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. ఇక సోమవారం తీవ్రవాదులు, గ్రమవాలంటీర్ల మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. మంగళవారం బిష్ణుపూర్ జిల్లాలో కుకి తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిపాయి. మైతీ పరిసర ప్రాంతాల్లోని బంకర్లు ఏర్పాటు చేసుకునేందుకు కుకి ఉగ్రవాదులు ప్రయత్నాలు చేశారు. అక్కడ బంకర్లను ఏర్పాటు చేసుకుంటే భద్రతా దళాలతో సమర్ధవంతంగా పోరాడవచ్చని వారి అంచనా.

Greater Noida society: లుంగీలు, నైటీలు బ్యాన్.. కీలక నిర్ణయం తీసుకున్న గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీ..

ఇక తాజా ఘటనలతో ఈస్ట్ ఇంఫాల్, వెస్ట్ ఇంఫాల్ జిల్లాల్లో కర్ఫ్యూని పొడగించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిలాక్షేషన్ ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పరిమితం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.

Arvind Kejriwal: సీపీఐ అగ్రనేతలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ.. ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ..

మే 3వ తేదీన ఈ వర్గాల మధ్య మొదటిసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. తమను షెడ్యూల్డ్ కులాల్లో కలపాలంటూ మైతీ వర్గం నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడేటరీ మార్చ్’పై దాడితో ఈ ఘర్షణ మొదలైంది. మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం వరకు ఉంటారు. వారంతా ఇంఫాల్ లోయలో ఉంటారు. ఇక నాగాలు, కుకీలు 40 శాతం ఉంటారు. వీరు ఇతర జిల్లాల్లో ఉంటారు.