ఇక్కడ చూడటానికి ఏంలేదు. వేలాది పిల్లతాబేళ్లు బిలబిలమంటూ సముద్రంలోకి వెళ్లిపోవడం తప్ప. వాచ్ చేయండి.

  • Published By: Mahesh ,Published On : May 9, 2020 / 01:02 PM IST
ఇక్కడ చూడటానికి ఏంలేదు. వేలాది పిల్లతాబేళ్లు బిలబిలమంటూ సముద్రంలోకి వెళ్లిపోవడం తప్ప. వాచ్ చేయండి.

Updated On : May 9, 2020 / 1:02 PM IST

ప్రకృతి కొన్నిసార్లు మైమరిపిస్తుంది. చిన్నచిన్న సంగుతులు… అద్భుతంగా కనిపిస్తాయి. అలాంటి ఓ క్యూట్ వీడియోను మీరు వాచ్ చేయొచ్చు. సముద్ర తీరాన కొన్నివేల పిల్ల తాబేలు సముద్రంలోకి పరిగెడుతున్న దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూడకపోవచ్చు. 
ఒడిశాలోని Gahirmatha BEACHలో తాబేలు గుడ్లు పెట్టడానికి ప్రతి యేడూ సముద్రంలో నుంచి బయటకు వచ్చి తీరంలో గుడ్లు పెడతాయి.  పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండడానికి ఇసుక గూళ్లు తయారు చేస్తుంటాయి. ఈ గుడ్ల ప్రక్రియను అరిబాడా అని పిలుస్తారు. 

ఆ పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇప్పటికే లాక్‌డౌన్. తీరంలో జనం గోల లేదు. అందుకే  వేలల్లో ఆ పిల్ల తాబేళ్ళన్నీ వెళ్తుంటే చూడటంకూడా  ఓ సూపర్ ఫీలింగ్.