Corona Vaccination: ఎంత బాధ్యతో!! ఖాళీ సిరంజితో ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు
ఆమెకు షో - కాజ్ నోటిసు జారీచేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కడ ఉన్నవారు మాత్రం వ్యాక్సిన్ సిరంజిలోకి ఎక్కిచ్చిన తర్వాతే టీకా వేశామని అంటున్నారు. పక్కన ఉన్న మరో నర్స్ సిరంజితో వ్యాక్సిన్ నింపి ఉంచుతున్నారని, ఆ సిరంజీనే ఇంజెక్ట్ చేస్తారని అంటున్నారు. కాగా జూన్ 21 తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు అధికారులు

Corona Vaccination (3)
Corona Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షలకు పైగా ప్రజలు టీకా తీసుకుంటున్నారు. ఇక టీకా కేంద్రాల్లో అక్కడక్కడ కొన్ని పొరబాట్లు జరుగుతున్నాయి. వైద్య సిబ్బంది పొరపాటున రెండు డోస్ లను ఒకేసారి ఇస్తున్నారు. మరికొన్న చోట్ల ఇంజెక్షన్ లో వ్యాక్సిన్ నింపకుండానే వేస్తున్నారు. తాజాగా బీహార్ లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
టీకా కేంద్రానికి వచ్చిన ఓ వ్యక్తికి, నర్స్ సిరంజితో వ్యాక్సిన్ నింపకుండానే ఖాళీ సిరంజిని ఇంజక్ట్ చేసింది. కానీ ఈ విషయం అక్కడ వారు గ్రహించలేదు. వాక్సినేషన్ చేస్తున్న సమయంలో వీడియో తీయడంతో ఆ వీడియోలో ఖాళీ సిరంజితో ఇంజక్షన్ చేసినట్లుగా గుర్తించారు. బీహార్‌లోని బహ్రాంపూర్ ఇమాంబరాలోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా టీకా సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హుస్సేన్, అమన్ ఖాన్ అనే ఇద్దరు స్నేహితులు కరోనా టీకా తీసుకునేందుకు టీకా కేంద్రానికి వచ్చారు.
హుస్సేన్ టీకా తీసుకుంటున్న సమయంలో తన స్నేహితుడిని వీడియో తీయాల్సిందిగా కోరాడు. దీంతో టీకా ఇస్తున్న దృశ్యాలను అమన్ ఖాన్ తన ఫోన్ లో బంధించాడు. ఇక టీకా తీసుకున్న అనంతరం హుస్సేన్, అతడి స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లి ఫోన్లో ఉన్న టీకా వ్యాక్సినేషన్ వీడియో చూసి షాకయ్యాడు. నర్స్ సిరంజిని ప్యాకెట్ లోంచి తీసి వ్యాక్సిన్ నింపకుండానే ఖాళీ సిరంజిని ఇంజక్ట్ చేసినట్లు గుర్తించాడు.
నాలుగైదు సార్లు వీడియోను పరిశీలించిన హుస్సేన్ వెంటనే నర్స్ దగ్గరకు వెళ్లి ప్రశ్నించాడు. అయితే ఆ వీడియో నర్స్ పొరపాటు జరిగినట్లు గురించారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హుస్సేన్, దీంతో అది వైరల్ గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు నర్స్ ని విధుల నుంచి తొలగించారు.
ఆమెకు షో – కాజ్ నోటిసు జారీచేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కడ ఉన్నవారు మాత్రం వ్యాక్సిన్ సిరంజిలోకి ఎక్కిచ్చిన తర్వాతే టీకా వేశామని అంటున్నారు. పక్కన ఉన్న మరో నర్స్ సిరంజితో వ్యాక్సిన్ నింపి ఉంచుతున్నారని, ఆ సిరంజీనే ఇంజెక్ట్ చేస్తారని అంటున్నారు. కాగా జూన్ 21 తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు అధికారులు