Corona Engine Oil : కరోనా రాదని.. ఇంజన్ ఆయిల్ తాగి వృద్ధుడు మృతి

కరోనా చికిత్స కోసం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా తగ్గుతుంది..అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు.

Corona Engine Oil : కరోనా రాదని.. ఇంజన్ ఆయిల్ తాగి వృద్ధుడు మృతి

Corona Engine Oil

Updated On : May 17, 2021 / 10:20 PM IST

Corona Engine Oil : కరోనా చికిత్స కోసం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా తగ్గుతుంది..అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. వాటిని గుడ్డిగా నమ్మి ఆచరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిమ్మరసం ముక్కులో వేసుకుంటే కరోనా రాదని నమ్మి, ఓ టీచర్ అలా చేసి ప్రాణాలే పొగ్గొట్టుకున్న ఉదంతం మరువక ముందే మరో దారుణం జరిగింది. ఇంజన్ ఆయిల్ తాగితే కరోనా రాదని పలువురు చెప్పిన మాటలు నమ్మి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

చెన్నై ఆర్కాడు సమీపం మేల్‌విశారంలో కుమార్‌ (64), రంజని (63) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇంజన్‌ ఆయిల్‌ తాగితే కరోనా రాదని పలువురు చెప్పగా, ఆ వదంతులను నిజమని నమ్మిన కుమార్‌, శనివారం సాయంత్రం ఇంజన్‌ ఆయిల్‌ తాగాడు. ఆ వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు.

ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని వేలూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనపై ఆర్కాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను, వాళ్లూ వీళ్లు చెప్పే వదంతులను నమ్మొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు.