ఉంగరంలో ఉల్లిపాయ : ఉల్లి ఏడ్పిస్తుంటే సెటైర్స్ నవ్విస్తున్నాయ్

ఉంగరంలో ఉల్లిపాయ..తాంబూలంలో ఉల్లిపాయలు. పేకాట రాయుళ్ల పందాల్లో ఉల్లిపాయలు. పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురుకి..పెళ్లి కొడుక్కి గిఫ్ట్ గా ఉల్లి పాయలు. జువెలరీ బాక్సుల్లో ఉల్లిపాయలు. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న ఓ వ్యక్తి దగ్గరకు సడెన్ గా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చారు. మేం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారం..మీ ఇంట్లో కూరల్లో ఉల్లిపాయలు వాడుతున్నారనీ తెలిసింది అందుకే మీ ఆస్తులపై రైడ్ చేయటానికి వచ్చామని కార్టూన్ తెగ నవ్విస్తోంది.
ఎవ్వరైనా వేలికి పెట్టుకునే ఉంగరంలో ఉల్లిపాయలు పెట్టించుకుని చేయించుకుంటారా. ముత్యాలు..పగడాలు..వజ్రాలు వంటి నవరత్నాలతో ఉంగరాలు చేయించుకుంటారు. కానీ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో ఉంగరంలో ఉల్లిపాయ ఫోటోను చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు పక్కలో ఉల్లిపాయల ప్యాకెట్ ను పెట్టుకుని పడుకోవటం..ఉల్లికవర్ కు తాళం వేయటం ఇలా ఎన్నో ఫోటోలు నవ్విస్తున్నాయి.
ఇలా ఉల్లిపాయలపై సెటైర్లు..జోకులు ఒకటీ రెండూ కాదు వేలాది వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే..ఉల్లిపాయలపై జోకులు మామూలుగా లేవు. వీటిని చూస్తుంటేనే..ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఉల్లిపాయలు ప్రజల్ని ఏడిపిస్తుంటే..ఉల్లి జోకులు మాత్రం నవ్విస్తున్నాయని.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత. బాధ నుంచి జోకులు వేసుకుని నవ్వుకునేలా చేస్తోంది ఉల్లి. అంటే ఆకాశాన్నంటే ధరలతో ఉల్లి ఓ పక్క ప్రజల్ని ఏడిపిస్తూనే..జోకులతో నవ్విస్తోంది. నవ్వు మనిషికి చాలా చాలా ఆరోగ్యాన్నిస్తుంది. ఉల్లి ప్రజలకు జోకులతోను..సెటైర్లతోను నవ్విస్తోందని అనుకోకతప్పదు. ఎందుకంటే ఉల్లి ధరల్ని మనం కంట్రోల్ చేయలేం.ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదు. కానీ ఉల్లి మాత్రం మనిషి జీవితంలో ఏదో కరంగా ఉల్లిపాయ ప్రధాన పాత్ర వహిస్తోందన్నమాట.
అలా ఫన్నీగా ఉండే కొన్ని ఉల్లి ఫోటోలు..