Online Class : బాబు క్వార్ట‌ర్ అంటే ఎంత‌?.. స్టూడెంట్ సమాధానం విని కంగుతిన్న ప్రొఫెసర్

ఆన్‌లైన్ క్లాసుల్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది.

Online Class : బాబు క్వార్ట‌ర్ అంటే ఎంత‌?.. స్టూడెంట్ సమాధానం విని కంగుతిన్న ప్రొఫెసర్

Online Class

Online Class : ఆన్‌లైన్ క్లాసుల్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థిని మ్యూట్ పెట్టకుండానే మరో విద్యార్థిని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది.. తోటి విద్యార్థులు మొత్తుకుంటున్నా ఆమెకు వీరి మాటలు వినపడలేదు. ఇదంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఇక తాజాగా అటువంటిదే మరో ఫన్నీ కన్వర్షన్ జరిగింది. ప్రొఫెసర్ ధావ‌ల్ పురోహిత్.. ఆన్‌లైన్‌లో సీఏ విద్యార్థులకు క్లాసెస్ తీసుకుంటున్నాడు.

Read More : అప్ఘానిస్తాన్ కు అమెరికా సాయం

ఆ స‌మ‌యంలో ఒక క్వార్ట‌ర్ అంటే ఎంత‌? అనే ప్ర‌శ్న‌ను త‌న స్టూడెంట్స్‌ను అడిగాడు. దీంతో ఓ విద్యార్థి టక్కుమని చాట్ బాక్స్ లో సమాధానం చెప్పాడు. ఇంతకూ అతడు చెప్పిన సమాధానం ఏంటనుకుంటారా? అతడు చెప్పిన సమాధానం.. క్వార్టర్ అంటే 30ఎంఎల్ అని.. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ప్రొఫెసర్.. వెంటనే అరె బాబు క్వార్ట‌ర్ అంటే 30 ఎంఎల్‌ 180 ఎంఎల్ కాదు క్వార్ట‌ర్ అంటే 3 నెల‌లు అని చెప్పేస‌రికి ఆన్‌లైన్ క్లాస్‌లో న‌వ్వులే న‌వ్వులు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

Read More :   రాజీనామా చేస్తే నీ ఇంటికొచ్చి కొరికేస్తా..!!