Parliament Staff: పార్లమెంట్‌లో 400మందికి కరోనా పాజిటివ్

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Parliament Staff: పార్లమెంట్‌లో 400మందికి కరోనా పాజిటివ్

Parliament

Updated On : January 9, 2022 / 4:25 PM IST

Parliament Staff: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దేశ రాజధానిలో కొత్త కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జనవరి 6-7 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా.. 65 మంది రాజ్యసభసభ సెక్రటేరియట్ సభ్యులు, 200మంది లోక్‌సభ సెక్రటేరియట్ సభ్యులు.. 133 మంది పార్లమెంట్‌లో పనిసేవారికి కరోనా సోకినట్లు గుర్తించారు.

జనవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొత్తం 1,409 మందికి చేపట్టిన కరోనా పరీక్షల్లో 402 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణకు వారి నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​కు పంపించినట్లు అధికారులు చెప్పారు. భారీగా కరోనా కేసులు నమోదైన క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కరోనా మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఉద్యోగుల ఉనికిపై ఆంక్షలు:
అధికారులు, ఉద్యోగుల హాజరుపై రాజ్యసభ సెక్రటేరియట్ నిషేధం విధించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం , అండర్ సెక్రటరీ / సీఈవో పదవి నుంచి 50 శాతం మంది అధికారులు, ఉద్యోగులు ఈ నెలాఖరు వరకు ఇంటి నుంచే పనిచేయాలి. వారు మొత్తం శ్రామిక శక్తిలో 65 శాతం ఉన్నారు.

వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపు లభిస్తోంది. అధికారిక సమావేశాలు వర్చువల్‌గా సాగనున్నాయి. మొత్తం 1300 మంది అధికారులు, ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు . వారి సంక్రమణను నిశితంగా పరిశీలించాలని, అవసరమైతే, ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడంలో సహాయపడాలని కోరారు.