మెడికల్ స్టాఫ్‌తో పాటు 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్

ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్లపైనా ఓ కన్నేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ‘సుమారుగా 50కి పైగా మెడికల్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇవన్నీ పేషెంట్లను ట్రీట్ చేసే సమయంలో సోకినట్లు కాదు. వారిలో కొందరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అందరిలానే కరోనా పాజిటివ్ అని తేలాక ట్రావెల్ హిస్టరీపై ఆరా తీసేసరికి నిజాలు వెలుగు చూశాయని అధికారి వెల్లడించారు.
వాళ్లు ఇన్ఫెక్షన్ కు గురైన మార్గం తెలిస్తేనే కరెక్ట్ గా ట్రీట్ చేయలం. పేషెంట్లను అడిగి తెలుసుకుంటున్నాం కానీ, వైద్య సిబ్బంది అలర్ట్ గానే ఉంటారనుకున్నాం. హాస్పిటళ్లలో డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ కు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (వ్యక్తిగత రక్షక పరికరాలు) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులు అడుగుతున్నారు. రోగులతో పాటు హాస్పిటల్ లో పనిచేసే వారు కూడా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు అంటున్నారు.
ఇటలీలో వైద్య సిబ్బంది, డాక్టర్లు ఎక్కువ మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. వారందరికీ పేషెంట్లకు ట్రీట్ చేసిన సందర్భంలోనే వైరస్ సోకింది. ఇంకొన్ని మరణాలు వైద్య సదుపాయం అందకపోవడంతోనే జరిగాయి. భారత్ లోనూ కరోనా కేసులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బందిలో రిస్క్ పెరుగుతుంది.
ఇప్పటికే ఇండియన్ ఆర్మీ డాక్టర్ ఒకరు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పోర్స్(సీఆర్పీఎఫ్) డాక్టర్ ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన డాక్టర్ కూడా పాజిటివ్ అని వచ్చింది. ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ కు కరోనా వచ్చింది. పైగా వాళ్లలో ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదు.
Also Read | లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన పలమనేరు ఎమ్మెల్యే