ఆక్సిజన్ సరఫరా చేయండి మహాప్రభో..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల ఒక సమస్య అయితే.. చికిత్సలో ముఖ్యంగా అవసరమయ్యే ఆక్సిజన్ కొరత మరొక సమస్యగా మారింది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు హర్యానా నుంచి భారీగా ఆక్సిజన్ సిలిండర్లను దుగుమతి చేసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం..

ఆక్సిజన్ సరఫరా చేయండి మహాప్రభో..

Oxygen Shortage Else Therell Be A Tragedy Delhi Cm Kejriwal Appeals To Pm Modi

Updated On : April 23, 2021 / 1:38 PM IST

oxygen shortage delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల ఒక సమస్య అయితే.. చికిత్సలో ముఖ్యంగా అవసరమయ్యే ఆక్సిజన్ కొరత మరొక సమస్యగా మారింది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు హర్యానా నుంచి భారీగా ఆక్సిజన్ సిలిండర్లను దుగుమతి చేసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం.. అయినా కూడా సమస్య తీరలేదు కదా.. మరింత ఉదృతం అయింది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ నిల్వలు సరిపోకపోవడంతో ఒడిశా నుంచి కూడా దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో కేంద్రం కూడా స్పందించి 480 మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి గాను 378 మెట్రిక్ టన్నులు కేటాయించింది..

అయితే ఇందులో 380 టన్నుల ఆక్సిజన్ మాత్రమే లభించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్.. నగరవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా కొరత గురించి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు. పరిస్థితిని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. లేకపోతే లేకపోతే విషాదంగా మారే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. దయచేసి ఆక్సిజన్ ను సరఫరా చేయండని అని అరవింద్ కేజ్రీవాల్ వేడుకున్నారు. ఈ సమస్యను తీర్చకుంటే ముఖ్యమంత్రిగా తాను ఉండి ఉపయోగం లేదని అన్నారు.