Pahalgam Terror Attack: పహల్గాం దుశ్చర్య మొత్తం వీడియో రికార్డ్.. చెట్టెక్కి రికార్డ్ చేసిన రీల్స్ వీడియోగ్రాఫర్..
కాల్పులు మొదలవగానే అతడు పారిపోయాడు. ఓ చెట్టెక్కి దాక్కున్నాడు.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి సంబంధించిన ఓ కీలక వీడియో ఎన్ఐఏ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. పహల్గాం దుశ్చర్య మొత్తం వీడియో రికార్డ్ అయ్యింది. ఉగ్రవాదులు దాడి చేస్తున్న సమయంలో ఓ రీల్స్ వీడియోగ్రాఫర్ చెట్టెక్కి దుశ్చర్యను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడి జరిగిన సమయంలో స్థానిక రీల్స్ వీడియోగ్రాఫర్ అక్కడే ఉన్నాడు. టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించగానే అతడు అప్రమత్తం అయ్యాడు. ప్రాణభయంలో అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. టెర్రరిస్టుల కంట పడకుండా ఉండేందుకు ఓ చెట్టు ఎక్కి దాక్కుడున్నాడు. అక్కడి నుంచే ఉగ్రవాదుల దుశ్చర్యను అతడు వీడియో తీశాడు. ఇప్పుడా వీడియో ఎన్ఐఏ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు, వారికి సహకరించిన వారిని గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఆ వ్యక్తి నుంచి పూర్తి వివరాలు సేకరిచినట్లు సమాచారం.
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో వీడియో గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఓ రీల్స్ వీడియోగ్రాఫర్ దుశ్చర్య మొత్తాన్ని వీడియో తీశాడు. ఉగ్రదాడి ఘటనలో ఈ ఫుటేజ్ ముఖ్యమైన సాక్ష్యంగా మారింది. తీవ్రవాదులను గుర్తించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.
Also Read: బాధితుల ప్యాంట్లు విప్పించి చెక్ చేసిన ఉగ్రవాదులు.. ఎందుకంటే?
కాగా, ఉగ్రవాదుల దాడి సమయంలో భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ తన కుటుంబంతో అక్కడే ఉన్నారు. ఆయన ఇచ్చిన సాక్ష్యం దర్యాప్తులో కీలకంగా మారింది. ప్రస్తుతం జమ్మకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి, సంఘటనల క్రమాన్ని నిశితంగా పరిశీలించి, దర్యాప్తు అధికారులకు విలువైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
చాలా మంది ప్రత్యక్ష సాక్షులు తాము చూసిన క్రూరత్వాన్ని అధికారులకు వివరించారు. అయితే శిక్షణ పొందిన సైనిక అధికారి ఇచ్చిన విలువైన సమాచారం దర్యాఫ్తులో అత్యంత కీలకంగా మారింది. ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ సమయంలో ఆ అధికారి తన కుటుంబానికి భద్రత కల్పించాడు. ఉగ్రవాద దాడి గురించి దర్యాప్తు సంస్థలకు కీలకమైన ఆధారాలను కూడా అందించాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనాలు, వీడియో ఆధారాల ఆధారంగా ఉగ్రవాద నిరోధక సంస్థ దాడి ఎలా జరిగిందో రీ కన్ స్ట్రక్షన్ చేసింది. మొదట్లో దుకాణాల సమూహం వెనుక దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చారు. అక్కడ గుమిగూడిన జనసమూహాన్ని కల్మా పఠించాలని డిమాండ్ చేశారు. కొన్ని క్షణాల తర్వాత, వారు నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తలపై కాల్పులు జరిపి, వారిని క్రూరంగా చంపారు. ఈ భయంకరమైన చర్య ఇతర పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పర్యాటకులు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో పారిపోతున్న వారిని టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. పర్యాటకుల తల, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. టూరిస్టులను చంపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యంగా తెలుస్తోంది. ఇంతలో జిప్ లైన్ ప్రాంతం నుండి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Also Read: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ తింటే క్యాన్సర్..! తాజా అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు..
ఏప్రిల్ 22న మధ్యాహ్నం రెండున్నర గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మొదటి డిస్ట్రెస్ కాల్ వచ్చింది. కాల్పుల్లో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. పోలీసులు, CRPF బృందాలు వచ్చే వరకు ఆమె తన భర్త పక్కనే ఉన్నారు.
సంఘటనా స్థలంలో మొదట స్పందించిన వ్యక్తి పహల్గామ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఘటనా స్థలానికి ముందుగా వచ్చిన ఆయన అక్కడ రక్తపాతాన్ని చూసి షాక్ కి గురయ్యారు. ఆయన వచ్చే సమయానికే ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి అదృశ్యమయ్యారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here