Parliament Bans : పార్లమెంటులో ప్లకార్డులు, పాంప్లేట్లపై కూడా నిషేధం..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో సభల్లో పాటించాల్సిన విధానాలు..మాట్లాడే పదాలు వంటి పలు అంశాలపై పలు నిషేధాలను విధించింది లోక్ సభ సెక్రటేరియట్. దీంట్లో భాగంగా మరిన్ని నిషేధాలను విధిస్తూ..తాజాగా ప్లకార్డులు, పాంప్లేట్లపై కూడా నిషేధం విధించింది.

Parliament Bans : పార్లమెంటులో ప్లకార్డులు, పాంప్లేట్లపై కూడా నిషేధం..

Parliament Bans Pamphlets, Placards

Updated On : July 16, 2022 / 12:52 PM IST

Parliament bans pamphlets, placards : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో సభల్లో పాటించాల్సిన విధానాలు..మాట్లాడే పదాలు వంటి పలు అంశాలపై పలు నిషేధాలను విధించింది లోక్ సభ సెక్రటేరియట్. ఇప్పటే పార్లమెంట్ ఉభయసభల్లో వాడకూడని (అన్ పార్లమెంటరీ వర్డ్స్) ఏమిటో వెల్లడిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్ తాజాగా మరిన్నింటిపై ఆంక్షలు విధించింది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, దీక్షలను కూడా నిషేధించింది. ఈ క్రమంలో తాజాగా మరిన్నింటిపై నిషేధాలు విధించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఎవరూ కూడా పాంప్లేట్లు (కరపత్రాలు), ప్లకార్డులను లోక్ సభలో ప్రదర్శించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.

Also read : Words Banned In Parliament: కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇక నుంచి పార్లమెంట్‌లో ఈ పదాలు వాడొద్దు..

పార్లమెంటులో ధర్మాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకపోవడంపై విపక్షాల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నిషేధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. కాగా పార్లమెంటు ఆవరణలో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తు తమ నిరసనలను తెలియజేస్తుంటాయి. అలాగే ఒక్కోసారి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా ప్లకార్డ్ ప్రదర్శిస్తుంటాయి.

Also read : Words Banned In Parliament : వద్దు అన్న పదాలనే పార్లమెంట్ లో వాడుతా..కావాలంటే సస్పెండ్ చేస్కోండి : TMC MP

ఇటువంటి పరిస్థితులు ఈ వర్షాకాల సమావేశాల్లో ఎక్కడా కనిపించకూడదు..నినాదాలు వినిపించకూడదు అనే చందంగా పలు నిషేధాలు విధించటం జరిగింది. ఎటువంటి సాహిత్యం కానీ, ప్రశ్నలు, కరపత్రాలు, ప్రెస్ నోట్లు, ఇతర రూపాల్లోని సమాచారాన్ని కానీ స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శించడాన్ని నిషేధించారు. ఈ నిబంధనలను అతిక్రమించిన సభ్యులను సస్పెండ్ చేయటం..లేదా ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇటువంటి నిషేధాలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా..ఈ నిబంధనలను సభ సభ్యులు అతిక్రమిస్తే..ఆయా సందర్భాలను బట్టి రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

Also read : Parliament: పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, దీక్షలు నిషేధం.. మండిపడుతున్న ప్రతిపక్షాలు