నీ కక్కుర్తి తగలెయ్యా: విమానంలో షూ ఆరబెట్టిన ప్యాసింజర్

నీ కక్కుర్తి తగలెయ్యా: విమానంలో షూ ఆరబెట్టిన ప్యాసింజర్

Updated On : January 18, 2020 / 3:45 AM IST

విమానంలో ప్రయాణికుడు షూ ఆరబెట్టుకోవడానికి చేసిన పని వైరల్‌గా మారింది. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. షూ ఆరబెట్టుకోవడానికి ఫ్లైట్ వెంటిలేటర్ వాడుకున్నాడు. ఈ ఘటన కెమెరాలో రికార్డు చేసిన మరో పాసింజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విమానాల్లో ఇలాంటి పనిచేస్తారా ఇది సిగ్గుపడాల్సిన విషయమంటూ పోస్టు చేశాడు. 

అతని షూ తీసి ఆరబెడుతుండగా.. ‘ఏ మాత్రం అవేర్‌నెస్ లేకుండా నాన్‌సెన్స్ చేస్తున్నారు. ప్లీజ్ స్టాప్’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీని కింద కోపంతో ఎమోజీల కామెంట్లు పెడుతున్నారు. 

‘ప్రజలు స్వార్థంగా తయారయ్యారు. ఏ మాత్రం సమాజం మీద అవగాహన లేకుండా ఉంటున్నారు. ఇది సీరియస్ గా షాకింగ్ విషయం. ఇలాంటి ఘటన ఎవరైనా చేస్తే అతను ఒప్పుకోగలడా. ప్రత్యేకించి ఓ చిన్న ప్రదేశంలో ఎంతవరకూ సబబు’ అని ఓ యూజర్ అడిగాడు.