‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌(అలహాబాద్)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా సఫాయి కరంచారి కర్పస్ ఫండ్ (కెఎస్‌కేసీఎఫ్) కు తన పర్సనల్ సేవింగ్స్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు.

  • Published By: sreehari ,Published On : March 6, 2019 / 02:18 PM IST
‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌(అలహాబాద్)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా సఫాయి కరంచారి కర్పస్ ఫండ్ (కెఎస్‌కేసీఎఫ్) కు తన పర్సనల్ సేవింగ్స్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌(అలహాబాద్)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా సఫాయి కరంచారి కర్పస్ ఫండ్ (కెఎస్‌కేసీఎఫ్) కు తన పర్సనల్ సేవింగ్స్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేందుకు కుంభమేళా స్వచ్చంధ వర్కర్లకు మోడీ ఫండ్స్ విరాళంగా అందించారు. ఫిబ్రవరి 24న జరిగిన సమావేశంలో స్వచ్ఛత మిషన్ కార్యక్రమంలో మోడీ శానిటేషన్ వర్కర్లతో సమావేశమయ్యారు.
Also Read : గూగుల్ Bolo App : కిడ్స్‌కు హిందీ, ఇంగ్లీష్‌లో టీచింగ్

ఈ సందర్భంగా గంగానది, యుమునా, సరస్వతి సంగమమైన ప్రయాగ్ రాజ్ దగ్గర స్వచ్ఛతపై ప్రస్తావించారు. శానిటేషన్ వర్కర్లను మోడీ రియల్ కర్మ్ యోగీలుగా కీర్తించారు. కుంభమేళా సమయంలో స్వచ్ఛత మిషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయడంలో కృషి చేసినందుకు వారిని ప్రశసంలతో మోడీ ముంచెత్తారు. గతంలోనూ పీఎం మోడీ ఎన్నో విరాళాలను సంక్షేమ కార్యక్రమాలకు అందజేశారు. ఇటీవల దక్షిణ కొరియాలో మోడీకి సీయోల్ శాంతి బహుమతిని ప్రధానం చేశారు. తనకు వచ్చిన మొత్తం ప్రైజ్ మనీ రూ.1.3 కోట్లు విరాళం ఇస్తున్నట్టు మోడీ ప్రకటించారు. 

ఈ మొత్తాన్ని పవిత్ర గంగానదిలోని నమామి గంగే ప్రాజెక్ట్ క్లీనింగ్ కోసం విరాళంగా ఇచ్చారు. అంతేకాదు.. అదనంగా తన మెమెంటోల వేలం సమయంలో జనరేట్ అయిన రూ.3.40 కోట్లను మోడీ గంగా నది స్వచ్ఛత కోసం విరాళంగా ఇచ్చారు. 2015 వరకు సూరత్ లో జరిగిన వేలంలో వచ్చిన బహుమతులకు సంబంధించిన రూ.8.33 కోట్లను కూడా మోడీ విరాళంగా ప్రకటించారు.
Also Read : దడ పుట్టించాడులే : దూరదర్శన్ ట్యూన్ తో బ్రేక్ డ్యాన్స్

గుజరాత్ సీఎంగా తన పదవీకాలం పూర్తిన సందర్భంగా మోడీ.. గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగుల కుమార్తెల చదువుకు తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి రూ.21 లక్షలు విరాళంగా ప్రకటించారు. సీఎంగా కొనసాగుతున్న క్రమంలో గిఫ్ట్స్ వేలంగా రూ.89.96 కోట్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని మోడీ. కన్య కెల్వానీ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. ఈ స్కీమ్ ద్వారా బాలికల చదువుకు ఖర్చు చేస్తారు. 
Also Read : తెలంగాణలో డ్రోన్‌ అంబులెన్స్: యాక్సిడెంట్లే టార్గెట్