Kedarnath : ఉత్తరాఖండ్‌లో మోదీ పర్యటన.. ఆది శంకరాచార్య విగ్రహా ఆవిష్కరణ..!
ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు.

Pm Modi In Kedarnath Today, To Inaugurate Projects Worth 310 Crore
PM Modi In Kedarnath : ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. మోదీ పర్యటన సందర్భ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. దేవాలయాన్ని 8 వందల కిలోల పుష్పాలతో అలకరించారు. కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆది శంకరాచార్య సమాధి స్థల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జగద్గురు ఆది శంకరాచార్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. 12 అడుగుల ఎత్తు,35 టన్నుల బరువు ఉన్న ఆది శంకరాచార్య విగ్రహ నిర్మాణాన్ని2019లో చేపట్టారు.
దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, నాలుగు శంకరాచార్య మఠాలు సహా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 400 కోట్లతో కేదార్ పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు, కేదార్ లోయలో ప్రధానికి స్వాగతం పలికేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని రాకతో సామాన్య భక్తుల దర్శనాన్ని ఈరోజు నిలిపివేశారు. ఆలయంలో స్వామి వారికి మహారుద్రాభిషేకాన్ని జరిపించారు మోదీ.
2019 ప్రధాని మోదీ కేదారేశ్వరుని ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు మరోసారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. కేదారేశ్వరుని దర్శనం తర్వాత ప్రధాని మోదీ సరస్వతీ ఘాట్‌లో ఆది శంకరాచార్య సమాధిని పునఃప్రారంభించారు. అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదలతో దెబ్బతిన్న సమాధిని మోదీ పునర్నిర్మించారు. మైసూరులో తయారుచేయించిన ఆదిశంకరాచార్యుల విగ్రహ పునః ప్రారంభ కార్యక్రమంలో మోదీతో పాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్,యూపీ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
Glimpses of the 12-foot Murti of Adi Guru Adi Shankaracharya to be inaugurated by PM Sh @narendramodi ji in Kedarnath tomorrow, Nov 5th.
On this occasion, pogrammes are being organized at Jyotirlingas, Jyotishpeeth & at the birthplace of the Jagadguru in Kalady, Kerala. pic.twitter.com/H71CHtX3af
— G Kishan Reddy (@kishanreddybjp) November 4, 2021
ఆధ్యాత్మిక పర్యటన ముగిసిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. అష్టపతి ఘాట్‌లో 130 కోట్లతో చేపట్టిన సరస్వతి రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్ సముదాయాలు, గరుడ్ చట్టి బ్రిడ్జ్, మందాకినీ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.
Read Also : Kedarnath : కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు!
There was a time when spirituality and religion were believed to be associated only with stereotypes. But, Indian philosophy talks about human welfare, sees life in a holistic manner. Adi Shankaracharya worked to make the society aware about this truth: PM Modi at Kedarnath pic.twitter.com/qhozsmNnn9
— ANI (@ANI) November 5, 2021