వాహ్..!!వర్షం కురిస్తే కనువిందు చేసే అద్భుతం..ప్రధాని షేర్ చేసిన వీడియో

  • Published By: nagamani ,Published On : August 26, 2020 / 02:04 PM IST
వాహ్..!!వర్షం కురిస్తే కనువిందు చేసే అద్భుతం..ప్రధాని షేర్ చేసిన వీడియో

Updated On : August 26, 2020 / 2:57 PM IST

తన మనససుకు నచ్చిన ఓ సుందర..అద్భుతమైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు. మోడీ షేర్ చేసిన కేవలం మూడు గంటల్లోనే ఏకంగా ఈ వీడియోకి 6 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే ఇక చెప్పేదేముంది. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



గుజరాత్ లోని మెహసనా జిల్లా, మోతేరా గ్రామంలో పుష్పావతి నది ఒడ్డున నిర్మించిన అత్యంద్భుతమైన దేవాలయం ఇది. 11వ శతాబ్దంలో చాళుక్యులు దీన్ని నిర్మించగా, ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా..శిథిలమైనా సరే తన ప్రాభవాన్ని చాటుకుంటూ అత్యంత సుందరమైన దృశ్యంతో ఆకట్టుకుంటోంది. కళ్లు తిప్పుకోనివ్వని అందంతో ఆకట్టుకుంటున్నా..ఈ ఆలయంలో ఇప్పుడు ఎటువంటి పూజలూ చేయడం లేదు. కానీ..ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత గల కట్టడంగా గుర్తించి, పరిరక్షిస్తోంది.
https://10tv.in/greta-thunberg-returns-to-school-after-year-of-climate-activism/
కాగా..ఈ దేవాలయం ప్రాంతంలో వర్షం పడితే ఎంతో అద్భుత దృశ్యం కళ్లు తిప్పుకోనివ్వదు. వర్షపు నీరు దేవాలయం మెట్లపై నుంచి జాలువారుతున్న దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఇదే విషయాన్ని వెల్లడించిన ప్రధాని మోదీ, మొతేరా సూర్య దేవాలయం సౌందర్యాన్ని చూడాలని కోరుతూ ఓ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఉదయం 7.45 గంటల సమయంలో మోదీ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పుడు దీన్ని ఎంతో మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి. వాహ్..ఏమి అందం అని అనకుండా ఉండలేరు.