కరోనాపై విజయానికి మోడీ చెప్పిన 7 సూత్రాలు

కరోనాపై భారతదేశం ఇప్పటికే విజయం సాధించామని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో కేంద్రం విధించనున్న లాక్ డౌన్ ముగియనున్న సందర్భంలో నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. ఇక కరోనాను విజయం సాధించేందుకు ఆయన 7 సూత్రాలు చేశారు. లాక్‌డౌన్ అమలుపై రేపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని మోదీ ప్రకటించారు.
1. మీ ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. వారికి కరోనా సహకరించకుండా జాగ్రత్త పడండి
2. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ధరించాలి.
3 రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్ విభాగం సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి.
4. కరోనాపై అవగాహన పెంచుకోవడానికి ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
5. వీలైనంత వరకు పేదకు సాయం చేయండి.
6. ఉద్యోగాల్లో నుంచి పనుల్లోంచి ఎవరినీ తొలగించకండి.
7. కరోనాపై పోరాటంలో విధులు నిర్వరిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు.