యువకులకు ప్రధాని మోడీ సందేశం: పొగాకు ప్రాణాంతకం.. అందుకే సిగరెట్లు నిషేధం

  • Published By: vamsi ,Published On : September 29, 2019 / 08:30 AM IST
యువకులకు ప్రధాని మోడీ సందేశం: పొగాకు ప్రాణాంతకం.. అందుకే సిగరెట్లు నిషేధం

Updated On : September 29, 2019 / 8:30 AM IST

మానవ ఆరోగ్యంపై, ముఖ్యంగా యువతపై చాలా హానికరమైన ప్రభావాలు చూపుతున్న కారణంగానే ఈ-సిగరెట్లను నిషేధించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ-సిగరెట్లు ప్రమాదకరం కాదనే అపోహ నేడు చాలా మంది యువతలో ఉందని కానీ, అది కరెక్ట్ కాదని మన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఈ సంధర్భంగా మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. యువతకు కీలకమైన సూచనలు చేశారు.

అలాగే పొగాకు వ్యసనం మానవ ఆరోగ్యానికి చాలా హానికరం అని మనందరికీ తెలుసు. కానీ ఈ వ్యసనం నుంచి బయటపడటం మాత్రం చాలా కష్టం. కానీ పొగాకు ప్రాణాంతకం ఏ రూపంలోనైనా పొగాకు తీసుకునేవారు క్యాన్సర్, డయాబెటిస్, రక్తపోటు వంటి రోగాల భారిన పడుతున్నారు. పొగాకు కారణంగా యువత నికోటిన్ ను తీసుకుంటుందని, నికోటిన్ చాలా హానికరం మరియు మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల యువత పొగాకుకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలోనే పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్లతో ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని ఈ- సిగరెట్లు అమ్మకం, వినియోగంపై నిషేధం విధించినట్టు తెలిపారు ప్రధాని మోడీ. ఈ చట్టం ఉల్లంఘనకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష మరియు రూ .5 లక్షల జరిమానాను విధించేలా చట్టం చేసింది ప్రభుత్వం.