తల్లి ఆశీస్సులు తీసుకుని ఓటు వేసిన మోడీ

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 03:42 AM IST
తల్లి ఆశీస్సులు తీసుకుని ఓటు వేసిన మోడీ

Updated On : April 23, 2019 / 3:42 AM IST

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో  పోలింగ్‌లో భారీ బందోబస్తు మద్య మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రనిప్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఓటేయడానికి ముందు ప్రధాని మోదీ గాంధీనగర్‌లో తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.

అలాగే గుజరాత్ సీఎం విజయ్ రూపాని భార్య అంజలి రాజ్ కోట్ లోని అనిల్ జ్ఞాన్ మందిర్ పాఠశాలలో పోలింగ్ బూత్లో ఓటు వేశారు.