మోడీ ట్వీట్ కు కేజ్రీవాల్ రిప్లయ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 11, 2020 / 03:22 PM IST
మోడీ ట్వీట్ కు కేజ్రీవాల్ రిప్లయ్

Updated On : February 11, 2020 / 3:22 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ట్వీట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానికి  ధన్యవాదాలు తెలిపారు. మన దేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తానని కేజ్రీవాల్…మోడీ ట్వీట్ కి రిప్లయ్ ఇచ్చారు. అంతకుముందు ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో ఆప్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 35మంది ఎమ్మెల్యేల మద్దతు అవరముంది. అయితే ఇప్పటికే ఆప్ విజయం ఖరారైపోయింది. ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 62స్థానాల్లో ఆప్ విజయం సాధించగా,కేవలం 8స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఇక దశాబ్దాల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ కు ఈ సారి కూడా ఒక్క సీటు కూడా దక్కలేదు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 67సీట్లు రాగా,బీజేపీకి3,కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 0తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హైవోల్టేజ్ క్యాంపెయిన్ నిర్వహించింది. 50రోజులుగా షాహీన్ బాగ్ లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసన కార్యక్రమాన్ని ఫోకస్ చేస్తూ..బీజేపీకి ప్రజలు ఓటు వేసి షాహీన్ బాగ్ నిరసనకు తమ వ్యతిరేకత తెలియజేయాలని క్యాంపెయిన్ చేసింది. అయితే ప్రజలు బీజేపీ వ్యాఖ్యలకు స్పందించలేనట్లు సృష్టంగా కన్పిస్తోంది. కేజ్రీవాల్ కే జై కొట్టారు ఢిల్లీ ప్రజలు.

ఈ విజయం సరికొత్త రాజకీయాలకు ప్రారంభమని, ఇది కొత్త సంకేతమని,రాబోయే ఐదేళ్లు ప్రజాసేవకు పునరంకితమవుతామని ఇవాళ ఘన విజయం తర్వాత కేజ్రీవాల్ అన్నారు. తనను సొంత కుమారుడిగా భావించి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం చెందుతుందని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఐలవ్ యూ అని చెప్పారు. ఆప్‌పై వరుసగా మూడోసారి విశ్వాసం ఉంచి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు తన కృతజ్ఞతలని అన్నారు. కామ్ కీ రంజీతీ అంటూ ఆప్ విజయంపై కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ హనుమాన్ ఆలయానికి వెళ్లారు.