టీచర్ నని చెబుతున్నా వినకుండా వేశ్యవంటూ మహిళపై పోలీసుల అత్యాచారం!

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 07:52 PM IST
టీచర్ నని చెబుతున్నా వినకుండా వేశ్యవంటూ మహిళపై పోలీసుల అత్యాచారం!

Updated On : February 15, 2020 / 7:52 PM IST

లా కీపర్లు..బ్రేకర్లుగా మారితే..శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు..నీచానికి ప్రవర్తిస్తే..సభ్యసమాజం తలదించుకొనేలా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలకు అండగా ఉండి..నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. ఈ నీచ ఘటన ఉత్తర్ ప్రదేవ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు వెల్లడించిన ప్రకారం…

గోరఖ్ పూర్ జిల్లాలోని గోరఖ్ నాథ్‌లో ఓ మహిళ ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె అక్క ఇంటికి వెళ్లి తిరగి వస్తోంది. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఉంది. ఈమె వెళుతుండగా..ఇద్దరు పోలీసులు చూశారు. ఆమెను అడ్డగించారు. వ్యభిచారం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. కానీ తాను అలాంటిదానిని కాదని..తల్లి కూడా వెనుక వస్తోందని చెప్పింది. కానీ కామంతో కళ్లుమూసుకపోయిన ఆ పోలీసులు బైక్‌పై బలవంతంగా ఎక్కించుకున్నారు.

రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఒకరితర్వాత..ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించడంతో వారు ఆమెను కొట్టారు. అనంతరం రాత్రి వేళ..విడిచిపెట్టారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం జరగగా, శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. హోటల్ సీసీ టివి ఫుటేజ్  పరిశీలిస్తున్నట్లు, గార్డు వాంగ్మూలం తీసుకున్నామని SSP గోరఖ్ పూర్ సునీల్ కుమార్ గుప్తా తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read More : కోవిడ్ – 19 : ఉద్యోగులపై మందుల పిచికారీ