కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు

  • Published By: bheemraj ,Published On : August 22, 2020 / 06:42 PM IST
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు

Updated On : August 22, 2020 / 7:45 PM IST

విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

సస్పెండ్ అయిన వారిలో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్ సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ఆగస్టు 11న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సస్పెండ్ అయిన వారికి గంగమ్మగుడి వద్ద విధులు కేటాయించినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

వారి వారి జంక్షన్లలో విధులు నిర్వహించడానికి బదులు ఓ పార్కులో ఉండడాన్ని బెంగుళూరు వెస్ట్ ట్రాఫిక్ డీసీపీ సౌమ్యలత ఎస్ కే గుర్తించారు. అలాగే మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించలేదని అధికారి తెలిపారు. విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.