“పద్మ” పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి

ఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో శనివారం వైభవంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. 2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మంది ఎంపికయ్యారు. 47 మందికి ఈ నెల 11న రాష్ట్రపతి అవార్డులను అందజేయగా మిగతావారికి ఈ రోజు ప్రదానం అందజేశారు. తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి లు పద్మశ్రీ అందుకున్నారు. ఒడిశాకు చెందిన ఛాయ్‌వాలా డీ ప్రకాశ్ రావు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. జానపద గాయని తీజన్ భాయ్ పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్, వాణిజ్యవేత్త మహస్య ధర్మపాల గులాటీ, పర్వతారోహకురాలు బచేంద్రి పాల్‌లు పద్మ భూషణ్ అందుకున్నారు. హీరో మనోజ్ బాజ్‌పాయి, తబలా ఆర్టిస్ట్ సప్నా చౌదరీ, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, పబ్లిక్ అఫైర్స్‌లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్‌లు పద్మశ్రీ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు.