ఈ బగ్గీ కోసం ఇండియా, పాకిస్థాన్ పోటీ పడితే.. లక్కీగా భారత్ చేతికొచ్చింది.. ఆ స్టోరీ వింటే గూస్ బంప్సే..

ఈ బగ్గీని చాలా కాలం వాడడం ఆపేసి, మళ్లీ ఇప్పుడు వాడుతున్నారని తెలుసా?

ఈ బగ్గీ కోసం ఇండియా, పాకిస్థాన్ పోటీ పడితే.. లక్కీగా భారత్ చేతికొచ్చింది.. ఆ స్టోరీ వింటే గూస్ బంప్సే..

Updated On : January 31, 2025 / 12:07 PM IST

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ మరోసారి సంప్రదాయ గుర్రపు బగ్గీని వినియోగించారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న ఈ బగ్గీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల గణతంత్ర దినోత్సవానికి కూడా ద్రౌపది ముర్ము ఇందులోనే వచ్చిన విషయం తెలిసిందే.

ఈ బగ్గీ కథేంటి?
ఈ బగ్గీని ఆరు గుర్రాలతో లాగిస్తారు. ఈ బగ్గీని బ్రిటిష్‌ కాలంలో భారత వైస్రాయి వాడేవారు. భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయిన సమయంలో ఈ బగ్గీ కోసం టాస్‌ ఇదరు దేశాలు టాస్‌ వేయడంతో ఇండియా విజయం సాధించింది.

Also Read: మధ్య తరగతికి గుడ్ న్యూస్? బడ్జెట్‌కి ముందు రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

అప్పట్లో ఇండియాకు చెందిన కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాక్‌కు చెందిన సహబ్జాదా యాకూబ్ ఖాన్ ఈ టాస్‌ వేశారు. అప్పటి నుంచి ఈ బగ్గీ భారత్‌ సొంతమైంది. 1984 గణతంత్ర వేడుకల వరకు దీన్ని రాష్ట్రపతి వినియోగించారు.

అయితే, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం భద్రతా కారణాల వల్ల దీని వినియోగాన్ని ఆపేశారు. 2014, 2016లో మాత్రం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బగ్గీలోనే బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమానికి వెళ్లారు.

మళ్లీ ఇప్పుడు ద్రౌపది ముర్ము దీన్నీ వాడుతున్నారు. ఆరు గుర్రాలు ఉండే ఈ బగ్గీకి బంగారు పూత పూసిన అంచులు ఉంటాయి. అలాగే, ఎరుపు వెల్వెట్ ఇంటీరియర్‌తో పాటు అశోక చక్రాన్ని ఈ బగ్గీ కలిగి ఉంటుంది.