ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం : కొత్తగా 3 మెట్రో లైన్లు
ముంబైలో మరో మూడు మెట్రో లైన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.19 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మూడు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ముంబైలో మరో మూడు మెట్రో లైన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.19 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మూడు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ముంబైలో మరో మూడు మెట్రో లైన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.19 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మూడు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని శనివారం (సెప్టెంబర్ 7, 2019) ఆయన ఆవిష్కరించారు. ఈ లైన్లు పూర్తయితే ఇప్పటికే ఉన్న ముంబై మెట్రోకు అదనంగా మరో 42 కిలోమీటర్ల లైన్లు కలిసిరానున్నాయి. గైముఖ్ నుంచి శివాజీ చౌక్ వరకు 9.2 కిలోమీటర్లు, కళ్యాణ్ నుంచి తలోజా వరకు 20.7 కిలోమీటర్లు, వాడాల నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు 12.8 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ప్రారంభోత్సవానికి ముందు విల్లేపార్లేలోని లోకమాన్య సేవా సంఘ్ తిలక్ మందిర్ లో ప్రధాని మోడీ వినాయకుడికి పూజలు జరిపారు. బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్దవ్ తాక్రే తదితరులు హాజరయ్యారు.
ముంబైలోని ఆరేయ్ కాలనీలో మెట్రో భవన్ నిర్మాణినికి కూడా ప్రధాని భూమిపూజ చేశారు. అయితే మెట్రో భవన్ నిర్మాణాన్ని స్థానికలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్మాణం కారణంగా సంజయ్ గాంధీ జాతీయ పార్క్ లోని వేలాది చెట్లను నరికివేయనున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నకిలీ వేలిముద్రలతో పాస్‌పోర్ట్స్ : నిందితులపై దేశద్రోహం కేసు
#WATCH PM Modi speaking at foundation stone laying ceremony of three metro lines in Mumbai https://t.co/LRm17A82cv
— ANI (@ANI) September 7, 2019