109 రకాల కొత్త వంగడాలు.. విడుదల చేసిన ప్రధాని మోదీ

స్వల్పకాలిక పంటలకు సంబంధించినవి 61 రకాల వంగడాలు ఉండగా, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు..

109 రకాల కొత్త వంగడాలు.. విడుదల చేసిన ప్రధాని మోదీ

Updated On : August 11, 2024 / 9:00 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 109 రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పాదకతతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో వీటిని విడుదల చేశారు.

వ్యవసాయ, ఉద్యాన పంటలు అధిక దిగుబడినివ్వడం, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడడమే ధ్యేయంగా వివిధ వంగడాలను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వీటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది.

వీటిలో స్వల్పకాలిక పంటలకు సంబంధించినవి 61 రకాల వంగడాలు ఉండగా, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు ఉన్నాయి. ఢిల్లీ పుసా ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కొత్త వంగడాలను ఆవిష్కరించారు నరేంద్ర మోదీ. ఆ తర్వాత రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. దేశంలో ప్రకృతి సేద్యాన్ని పెంపొందించడం, ఆర్గానిక్ ఆహారాన్ని అధికంగా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని మోదీ అన్నారు.

 

Also Read: తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం ఆందోళనకరం- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు