Priyanka Chopras 200Carat Diamond Necklace : మైండ్ బ్లోయింగ్.. ప్రియాంక చోప్రా మెడలో 200 క్యారెట్ ఎమరాల్డ్ డైమండ్ నెక్లెస్.. దీన్ని చేయడానికి ఎన్ని గంటలు పట్టిందో తెలిస్తే షాకే..
తన సోదరుడి మెహందీ వేడుకలోనూ ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి జిగేల్ మన్నారు.

Priyanka Chopras 200Carat Diamond Necklace : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన సోదరుడి పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె వేసుకున్న డ్రెస్ అదరహో అనిపించింది. ఇక, ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాన్ని ప్రత్యేకతలు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ప్రియాకం చోప్రా వేసుకున్నది అచ్చంగా 200 క్యారెట్ ఎమరాల్డ్ డైమండ్ నెక్లెస్. అంతేకాదు.. దాన్ని తయారు చేయడానికి ఏకంగా 1600 గంటల సమయం పట్టిందట.
ప్రియాంక ధరంచిన సొగసైన నెక్‌పీస్‌ని ఎమరాల్డ్ వీనస్ నెక్లెస్ అని పిలుస్తారు. ది గార్డెన్ ఆఫ్ వండర్స్ హై జ్యువెలరీ కలెక్షన్ అది. బల్గారి వెబ్‌సైట్ ప్రకారం.. ఆ ఆభరణం.. ఇటాలియన్ కాపెల్ వెన్ రే అనే విలాసవంతమైన మధ్యధరా మొక్క నుండి ప్రేరణ పొందింది. నెక్లెస్‌ని పూర్తి చేయడానికి బల్గారీ కళాకారులకు దాదాపు 1,600 గంటల సమయం పట్టింది. నెక్‌పీస్‌తో పాటు ప్రియాంక డైమండ్, ఎమరాల్డ్ రింగులు ధరించారు. అందమైన ముత్యాలు-డైమండ్ చెవి పోగులను ఎంచుకున్నారు.
ఇక.. ప్రియాంక తన సోదరుడి మెహందీ వేడుకలోనూ ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించారు. అరుదైన పింక్ డైమండ్ బల్గారీ నెక్లెస్‌ను ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కాగా, ప్రియాంక బల్గారి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తరచుగా వారి ఖరీదైన ఆభరణాలను ధరిస్తుంటారు.