Priyanka Gandhi: మధ్యప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ పర్యటన.. నర్మదా నదికి పూజలు
మధ్యప్రదేశ్ జీవనాడిగా నర్మదా నదిని భావిస్తారు. ఈ సందర్భంగా గౌరీఘాట్ వద్ద నర్మద నదికి ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Priyanka Gandhi
Madhya Pradesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రంపై దృష్టిసారించింది. మరికొద్ది నెలల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమలం పార్టీని గద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆమె సోమవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జబల్‌పూర్‌లో కాంగ్రెస్ నాయకులు కమల్ నాథ్, ఇతర పార్టీ నేతలతో కలిసి ప్రియాంక నర్మదా నదిలో పూజలు నిర్వహించారు.
Priyanka Gandhi Vadra : సిమ్లా జహు హనుమాన్ దేవాలయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక పూజలు
మధ్యప్రదేశ్ జీవనాడిగా నర్మదా నదిని భావిస్తారు. ఈ సందర్భంగా గౌరీఘాట్ వద్ద నర్మద నదికి ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచార్య ఓంకార్ దూబే నేతృత్వంలోని 101 మంది బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య ప్రియాంక నర్మదా పూజ, హారతి నిర్వహించారు. మధ్యప్రదేశ్ కు జీవనరేఖగా భావించే నర్మదా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే తరుణ్ భానోత్ ప్రియాంక గాంధీకి వినాయక ప్రతిమను బహుకరించారు.
Priyanka Gandhi: ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: ప్రియాంక గాంధీ
మరికొద్ది నెలల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంక బజల్‌పూర్ నుంచి విజయ్ సంకల్ప్ ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడజరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదిలాఉంటే ప్రియాంక గాంధీ వాద్రా నర్మదా నదికి పూజులు నిర్వహించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
मां नर्मदा के आशीर्वाद के साथ हुआ 'विजय शंखनाद' का शुभारंभ
📍जबलपुर, मध्य प्रदेश#विजय_शंखनाद_मध्यप्रदेश pic.twitter.com/pNyRAWxlma
— Congress (@INCIndia) June 12, 2023