కదిలిన ప్రియాంకా గాంధీ బోటు : గంగానదిపై ఎన్నికల ప్రచారం

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 06:59 AM IST
కదిలిన ప్రియాంకా గాంధీ బోటు : గంగానదిపై ఎన్నికల ప్రచారం

Updated On : March 18, 2019 / 6:59 AM IST

హైద‌రాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్ర‌తో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు  బోటో ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారం కొనసాగి వార‌ణాసిలోని అసి ఘాట్ వ‌ద్ద ప్ర‌చారం ముగుస్తుంది. ఈ క్రమంలో మార్చి 18 ఉద‌యం ప్ర‌యాగ్‌రాజ్‌లో..హనుమాన్ ఆల‌యంతో పాటు త్రివేణి సంగ‌మంలో ప్రియాంకా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
Read Also : నానమ్మ జ్ఞాపకాలలో ప్రియాంక :ఆమె చెప్పిన కథలు వినిపిస్తున్నాయి

యూపీలో కాంగ్రెస్‌కు పున‌ర్ వైభ‌వం వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఈ సంద‌ర్భంగా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. స‌త్యానికి, స‌మానాత్వానికి ప‌విత్ర గంగా న‌దియే సాక్ష్య‌మ‌ని..రాష్ట్ర ప్ర‌జ‌లు గంగా న‌దిపైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారనీ..నేను కూడా గంగా న‌ది ప్ర‌వాహంలో మీతో క‌లిసిపోవటానికే ఈ బోటు ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నానని ప్రియాంకా గాంధీ ఓ లేఖ‌ ద్వారా తెలిపారు. 

ప్రియాంకా గాంధీ రాకతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ వచ్చిందని నేతలు భావిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలలో ప్రియాంకా సేవల్ని వినియోగించుకుని అధికారంలోకి రావటం ఖామని భావిస్తున్న పార్టీ ప్రియాంకా గాంధీకి యూపీ ప్రచార బాధ్యతల్ని అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంకా గంగానదిలో బోట్ ద్వారా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.