WII Recruitment 2022: డబ్ల్యూఐఐ లో ప్రాజెక్టు స్టాఫ్ భర్తీ

భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ , వెటర్నరీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి.

WII Recruitment 2022: డబ్ల్యూఐఐ లో ప్రాజెక్టు స్టాఫ్ భర్తీ

WII Recruitment 2022

Updated On : December 30, 2021 / 4:38 PM IST

WII Recruitment 2022 : భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రుడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండియా లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేష్ ద్వారా మొత్తం 98 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ , వెటర్నరీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత , పని అనుభవం కలిగి ఉండాలి.

షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు 2022 జనవరి 25 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://wii.gov.in/సంప్రదించగలరు.