పౌరసత్వ ప్రకంపనలు : జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వద్ద ఉద్రిక్తత

  • Published By: madhu ,Published On : December 15, 2019 / 10:42 AM IST
పౌరసత్వ ప్రకంపనలు : జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వద్ద ఉద్రిక్తత

Updated On : December 15, 2019 / 10:42 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ..దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసనలు, ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ రణరంగంగా మారింది. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం వర్సిటీలోని కలింది కూంజ్ రోడ్ వద్ద భారీగా ఆందోళనలు కారులు తరలివచ్చారు.

ఇందులో విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

* డిసెంబర్ 14వ తేదీ శనివారం వర్సిటీ రణరంగంగా మారిపోయింది. వర్సిటీ విద్యార్థులను పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
* విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు.
* ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు, పోలీసులకు గాయాలయ్యాయి. 
Read More : పెళ్లైన రాత్రే పెళ్లి కూతురు పరార్ : డబ్బు, నగలు మాయం

* పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ  నాగాలండ్‌, మేఘాలయలతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ నెల 21వ తేదీన బీహార్‌ బంద్‌ పాటించాలని ఆర్‌జేడీ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

* పౌరసత్వ చట్టంపై అస్సాంలో నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఈనెల 18న విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.
* మరోవైపు వదంతులు వ్యాపించకుండా అస్సాంలో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు. ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.