ఎన్నికల ప్రచారానికి వెళ్తే…పెళ్లి చేసుకోమంటున్నారట

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడికి ప్రచారంలో మరో రకమైన సపోర్ట్ వస్తుందట. అయితే ఆయనకు వస్తున్న ఆ మరో రకమైన మద్దతు ఓట్లను తెచ్చిపెడుతుందో లేదో తెలియదు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి ప్రచారంలో పాల్గొంటే చాలు ఆయనకు పెళ్లి ప్రపోజల్స్ తెగ వచ్చేస్తున్నాయంట. ఇంతకీ ఆ ఆప్ లీడర్ ఎవరు? ఆయనకు ప్రచారంలో ఎదురువుతున్న వెరైటీ అనుభవలేంటే తెలుసుకుందాం
ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున రాఘవ్ చద్దా(31)పోటీ చేస్తున్నారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. చార్టెడ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించి రాజకీయవేత్తగా ఎదిగిన రాఘవ్..ఆమ్ ఆద్మీ పార్టీ 39మంది స్టార్ క్యాంపెయినర్లలో ఒకరు. సాధారణంగా నేతల ఎన్నికల ప్రచారం నచ్చితే..జనాలు వారికి నీరాజనం పలుకుతారు. అయితే రాఘవ్ చద్దాకు మాత్రం కాస్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి.
ప్రచారంలో రాఘవ్ పాల్గొన్న సమయంలో..చాలా మంది మా కుతుర్ని పెళ్లి చుసుకుంటారా అని నేరుగా ఆయనను అడిగేస్తున్నారంట. అనేకమంది అమ్మాయిలు అయితే నేరుగా ఆయనను నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగేస్తున్నారంట. సోషల్‌మీడియాలో కూడా చాలా మంది యువతులు రాఘవ్ చద్దాను ఫాలో అవుతూ..తమను పెళ్లి చేసుకోవాలంటూ రాఘవ్‌ను కోరుతున్నారట. ఈ విషయాన్ని రాఘవ్ చద్దా సోషల్‌మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తోన్న సిబ్బంది తెలిపారు. రాఘవ్ ప్రచారంలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతుండటంతో..నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ యువతులు కామెంట్లు పెడుతున్నారట. పెద్ద వయస్సు వాళ్లవైతే..ఒక వేళ నాకే కూతురు ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ కామెంట్లు పెడుతున్నారట.
అయితే రాఘవ్ మాత్రం దేశ ఎకానమీ పరిస్థితి బాగాలేదని..పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని రిప్లై ఇస్తున్నాడంట. మరి సోషల్‌మీడియాలో పాపులర్ అయిన రాఘవ్‌చద్దాకు..ఫాలోవర్లు ఓట్లు వేస్తే ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. గతేడాది జరిగిన లోక్ షభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసిన రాఘవ్ ఓటమి పాలయ్యాడు. ఈ సారి బీజేపీ వెటర్నన్ ఆర్పీ సింగ్ తో, మరో వైపు కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నిక్లలో అత్యంత పిన్నవయస్కుడైన రాఖీ తుస్సీడ్(25)పై రాఘవ్ తలపడుతున్నాడు.