రాహుల్ గాంధీ నామినేషన్.. సోదరుని వెంట ప్రియాంక

ఉత్తరాధి నుంచి ఒక చోట.. దక్షిణాది నుంచి మరో చోట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చే యోచనతో రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వాయనాడ్ నియోజకవర్గంలో నేడు(4 ఏప్రిల్ 2019) రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ భారీ రోడ్ షో ను ప్లాన్ చేసింది. రాహుల్ గాంధీ నామినేషన్‌కు ఆయనతో పాటు సోదరి ప్రియాంక గాంధీ కూడా వచ్చింది. ఆమె కూడా రోడ్‌షో లో పాల్గొంది.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేథి నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తను బస చేసిన కొజికోడ్ నుంచి వాయనాడ్‌కు 90 కిమీ దూరం ఉండనుండగా రాహుల్ గాంధీ హెలిక్యాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు.