BJP Slams Rahul Gandhi: చైనా ముందు భారత్ లొంగిపోవాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు: బీజేపీ

‘‘రాహుల్ గాంధీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా చైనా ముందు భారత్ లొంగిపోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ తికమకపడే, ఆందోళన చెందే ఉండే నాయకుడు. ఆయనలాంటి మరో సినీ స్టార్ తో (కమల హాసన్) మాట్లాడారు’’ అని సుధాంశు త్రివేది చెప్పారు.

BJP Slams Rahul Gandhi: చైనా ముందు భారత్ లొంగిపోవాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు: బీజేపీ

BJP Slams Rahul Gandhi

Updated On : January 3, 2023 / 6:09 PM IST

BJP Slams Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సినీనటుడు కమల హాసన్ ను తన యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. చైనా ముందు భారత్ లొంగిపోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని, ఆయన ఎల్లప్పుడూ తికమకపడుతుంటారని ఎద్దేవా చేసింది. ఇవాళ బీజేపీ నేత సుధాంశు త్రివేది ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘రాహుల్ గాంధీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా చైనా ముందు భారత్ లొంగిపోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ తికమకపడే, ఆందోళన చెందే ఉండే నాయకుడు. ఆయనలాంటి మరో సినీ స్టార్ తో (కమల హాసన్) మాట్లాడారు’’ అని సుధాంశు త్రివేది చెప్పారు.

రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారతీయతను అర్థం చేసుకోవాలని, అంతేగాక, దేశం మొత్తం తిరిగితే భారత్ ను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు భారత్ లో తిరిగారని, అయినప్పటికీ దేశాన్ని అర్థం చేసుకోలేదని ఎద్దేవా చేశారు. తన ప్రయాణంలో భాగంగా రాహుల్ గాంధీ పలు అంశాలపై పదే పదే తికమకపడుతున్నారని ఆయన చెప్పారు.

Karnataka: ఎన్నికలలోపు మాజీ సీఎం జైలుకు వెళ్తారంటూ హెచ్చరించిన బీజేపీ చీఫ్