Rahul Gandhi Tweet: కర్ణాటక సీఎంకు లేఖరాసిన రాహుల్ గాంధీ.. సానుకూలంగా స్పందించిన బసవరాజ్ బొమ్మై.. అసలు సమస్య ఏమిటంటే?

రాహుల్ గాంధీ లేఖపై కర్ణాటక సీఎం స్పందించారు. గున్న ఏనుగుకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని, అటవీ అధికారులతో మాట్లాడి దానిని రక్షించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Rahul Gandhi Tweet: కర్ణాటక సీఎంకు లేఖరాసిన రాహుల్ గాంధీ.. సానుకూలంగా స్పందించిన బసవరాజ్ బొమ్మై.. అసలు సమస్య ఏమిటంటే?

Karnataka Cm

Updated On : October 6, 2022 / 2:22 PM IST

Rahul Gandhi Tweet: కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. గురువారం పాదయాత్రలో రాహుల్ గాంధీ తల్లి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. సోనియా సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు వచ్చారు. మరోవైపు విజయదశమి సందర్భంగా భారత్ జోడో పాదయాత్రకు మంగళ, బుధవారాల్లో రాహుల్ విరామం ఇచ్చారు.

“Chamchagiri” Remark: రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. నోటీసులు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నిర్ణయం

బుధవారం తల్లి సోనియాతో కలిసి రాహుల్ గాంధీ నాగరహళ్లి టైగర్ రిజర్వ్ ను సందర్శించారు. అక్కడ గున్న ఏనుగు గాయపడటాన్ని రాహుల్ గమనించారు. గాయపడిన గున్న ఏనుగు తన తల్లి వద్ద సేదతీరుతూ ఉన్న ఫొటోను రాహుల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టుచేశారు. గాయపడిన గున్న ఏనుగుకు వెంటనే వైద్య సేవలు అందించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశాడు. అయితే, ఆ లేఖలో రాజకీయాలను పక్కకుపెట్టి సాయం అందించాలని రాహుల్ కోరాడు.

గురువారం రాహుల్ గాంధీ లేఖపై కర్ణాటక సీఎం స్పందించారు. గున్న ఏనుగుకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని, అటవీ అధికారులతో మాట్లాడి దానిని రక్షించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వినతి మేరకు మానవతా దృక్పదంతో తాను స్పందిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు.